ఏడాదిలో ఇన్వెస్టర్లను ముంచేసిన సిప్ స్కీమ్స్.. 48 శాతం వరకు డౌన్.. లిస్టులో SBI, HDFC, టాటా ఫండ్స్!

Wait 5 sec.

: మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏడాది కాలంగా పెద్ద మొత్తంలో నష్టపోతుండగా.. మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాల్నే ఇస్తున్నాయి. ఈ క్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే గనుక ఏడాది వ్యవధిలోనే చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టాల్ని ఇచ్చాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి.. 2026 మార్చి వరకు మొత్తం 556 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే.. ఇక్కడ 486 ఫండ్స్ నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. మరో 70 ఫండ్స్ సానుకూలంగా కదలాడాయి. లాభాల్ని ఇచ్చిన వాటిల్లో చూస్తే ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉండటం విశేషం. వీటిల్లో ఏడాది వ్యవధిలో టెక్ ఫండ్స్ ఎక్కువగా నష్టపోయాయి. క్వాంట్ టెక్ ఫండ్ అత్యధికంగా 47.17 శాతం పడిపోగా.. మోతీలాల్ ఓస్వాల్ డిజిటల్ ఫండ్ 35.38 శాతం పతనం అయ్యాయి. చాలా వరకు టెక్ స్టాక్స్ ఈ సమయంలో భారీగా పడిపోవడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ ఏకంగా 32.56 శాతం మేర నష్టాల్ని మిగిల్చింది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ టెక్నాలజీ ఫండ్, టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఫండ్స్ వరుసగా 31.79 శాతం, 30.13 శాతం, 29.63 శాతం మేర పడిపోయాయి. మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ నుంచి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మల్టీ క్యాప్ ఫండ్స్ వరుసగా ఏడాది వ్యవధిలో 28.36 శాతం, 27.68 శాతం మేర పతనం అయ్యాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ కన్సంప్షన్ ఫండ్, సుందరం కన్సంప్షన్ ఫండ్ వరుసగా 25.74 శాతం, 25.42 శాతం మేర తగ్గాయి. సిప్ పెట్టుబడులపై కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏడాదిలో 20.78 శాతం నష్టాల్ని మిగిల్చింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ స్మాల్ క్యాప్ ఫండ్స్ చూస్తే వరుసగా ఏడాది సమయంలో 19.66 శాతం, 18.95 శాతం, 18.96 శాతం మేర నష్టాల్ని ఇచ్చాయి.నిప్పన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ ఈ సమయంలో టాప్ పెర్ఫామర్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులపై 164 శాతం రిటర్న్స్ అందించడం విశేషం. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్ట్రాటజిక్ మెటల్ అండ్ ఎనర్జీ ఈక్విటీ ఎఫ్ఓఎఫ్ ఇది కూడా ఇన్వెస్టర్లకు ఏడాదిలో రికార్డు స్థాయిలో 101.22 శాతం రిటర్న్స్ అందించింది. ఎడెల్‌వీస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్- షోర్ ఫండ్ 38.91 శాతం, హెచ్‌ఎస్‌బీసీ ఆసియా పసిఫిక్ (ఎక్స్- జపాన్) డీవైఎఫ్ స్కీమ్ 38.87 శాతం మేర రాబడి ఇచ్చింది. Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.