ఆరంభానికి అంతా సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత భారత అభిమానులకు ఐపీఎల్ సీజన్ మరో ఫీస్ట్‌లా మారనుంది. తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ అడుగుపెట్టనుండగా.. అరివీర భయంకరులుగా సన్‌రైజర్స్ బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్ టీవీ నెట్‌వర్క్, జియో హాట్ స్టార్ యాప్/వెబ్ సైట్‌లో వీక్షించొచ్చు. ఐపీఎల్‌లో ఆర్సీబీ - సన్‌రైజర్స్ మ్యాచ్ అంటే ఒకరకమైన వైబ్ గ్యారెంటీగా ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల 26 సార్లు తలపడ్డాయి. అందులో సన్‌రైజర్స్‌ది పైచేయిగా ఉండటం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్‌లలో గెలిచింది. చిన్నస్వామిలో మాత్రం ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగితే ఆర్సీబీ 5 గెలిచింది. బెంగళూరుపై హైదరాబాద్ అత్యధికంగా 287 పరుగులు నమోదు చేస్తే, ఆర్సీబీకి కూడా పోటాపోటీగా 262 పరుగులు బాదింది. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్ నువ్వా - నేనా అన్నట్టు సాగనుంది. ఈ ఆరంభ మ్యాచ్‌కు ఆర్సీబీ, సన్‌రైజర్స్ జట్ల తమ టాప్ బౌలర్లు లేకుండానే ఆడుతున్నాయి. గాయాల కారణంగా జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమవుతున్నారు. యశ్ దయాల్ కూడా లేకపోవడంతో ఆర్సీబీ మంగేశ్ యాదవ్‌ని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ మాత్రం హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ, హర్ష్ దూబే‌తో బౌలింగ్ ఫర్వాలేదు అనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్క్వాడ్విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, జేకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసీఖ్ సలామ్ దార్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, విహాన్ మల్హోత్రా, విక్కీ ఓస్ట్వాల్, అభినందన్ సింగ్, జేకబ్ బెథెల్, జోర్డన్ కాక్స్, స్వప్నిల్ సింగ్, కనిష్క్ చౌహాన్, సత్విక్ దేశ్వాల్.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్క్వాడ్అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఈషాన్ మలింగా, శివం మావి, స్మరణ్ రవిచంద్రన్, జీషాన్ అన్సారి, సలీల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సైన్, క్రైన్స్ ఫులేట్రా, అమిత్ కుమార్.