సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఇదే? ఆ ఒక్కడు లేకపోవడంతో టీమ్ వీక్!

Wait 5 sec.

పేరు వింటేనే స్కోర్ బోర్డు కూడా షేక్ అవుతుంది. ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ టీమ్ స్కోర్స్‌ అన్నీ సన్‌రైజర్స్‌వే. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఎప్పుడున్నా ఫ్యాన్స్ అంతా స్కోర్ బోర్డు వైపే చూస్తుంటారు. అరివీర భయంకర బ్యాటింగ్ లైనప్‌తో స్ట్రాంగ్‌గా ఉండే సన్‌రైజర్స్‌కి బౌలింగే కొంచెం వీక్. ఇప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఆ జట్టును మరింత బలహీనపరుస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ స్టార్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండటం సన్‌రైజర్స్‌కి కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉండే సన్‌రైజర్స్‌కి లియామ్ లివింగ్‌స్టోన్ తోడవ్వడంతో మరింత స్ట్రాంగ్ అయింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతుండగా.. మూడో స్థానంలో తాత్కాలిక కెప్టెన్ ఇషన్ కిషన్ రానున్నాడు. ఇక మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, రూ. 13 కోట్లు పెట్టి కొన్న లియామ్ లివింగ్ స్టోన్‌ రాణించనున్నారు నితీష్ కుమార్ రెడ్డి గత సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఈ సీజన్‌లో అయినా కమ్ బ్యాక్ ఇస్తాడని టీమ్ ఎదురుచూస్తోంది. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. జేక్ ఎడ్వర్డ్స్ ఇప్పటికే టోర్నమెంట్‌కు దూరం కాగా ప్యాట్ కమిన్స్ కూడా లేకపోవడంతో ఆ జట్టు మరింత వీక్‌గా ఉంది. గత సీజన్‌లో హర్షల్ పటేల్ 16 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఫ్యాన్స్‌ని సన్‌రైజర్స్ బౌలర్లు కాస్త టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్.