RCB బలమంతా ఆ హిట్టర్లే, భువీ మ్యాజిక్ చేస్తే ఇక అంతే.. ఈ ప్లేయింగ్ 11తో సన్‌రైజర్స్‌కి చుక్కలేగా..!

Wait 5 sec.

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌కి సన్నద్ధమవుతోంది. ట్రోఫీ గెలిచిన ఉత్సాహంతో ఐపీఎల్ 2026లో అడుగుపెడుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ని మొదలుపెట్టనుంది. తమ చిరకాల ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలవ్వనుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తీక్ అడుగుపెట్టిన తర్వాత జట్టు చాలా బలంగా మారింది. కేవలం బ్యాటింగో, కేవలం బౌలింగో అని లేకుండా మొత్తం బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా జట్టును ఎంపిక చేశాడు. అదే మంత్రం ఆర్సీబీని ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా నిలిపింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ఆర్సీబీ చూస్తోంది. విరాట్ కోహ్లి, ఫిల్ సాల్టే ఈ సీజన్‌ను కూడా ఓపెన్ చేయనున్నారు. వెంకటేశ్ అయ్యర్‌ని జట్టులోకి తీసుకోవడంతో మూడో స్థానంలో పడిక్కల్‌ని ఆడించాలా? లేక వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇవ్వాలా? అన్న డైలమాలో మేనేజ్‌మెంట్ పడింది. కెప్టెన్ రజత్ పటిదార్ మిడిలార్డర్‌లో రానున్నాడు. ఆర్సీబీకి బలమైన హిట్టర్లు ఉండటం కలిసొచ్చే అంశం. జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా వరుసగా బ్యాటింగ్ ఆర్డర్‌లో రావడంతో ఆఖర్లో భారీగా స్కోర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దినేశ్ కార్తిక్ తర్వాత జితేశ్ శర్మ కేవలం వికెట్ కీపింగ్ బాధ్యతలే కాకుండా హిట్టింగ్ బాధ్యతలు కూడా తీసుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కృనాల్ పాండ్యా బ్యాట్, బాల్‌తో రాణిస్తున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ మంగేశ్ యాదవ్‌ను ఆర్సీబీ ప్రయోగించనుంది. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించనుంది. భువనేశ్వర్ కుమార్, మంగేశ్ యాదవ్, జాకబ్ డప్ఫీతో పాటు రొమారియో షెఫర్డ్ బౌలింగ్ విభాగంలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ ప్లేయింగ్ 11 అంచనాఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్/వెంకటేశ్ అయ్యర్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో ఫెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మంగేశ్ యాదవ్, జాకబ్ డప్ఫీ.