ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలపై సీఎం నారా నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాలతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాయపూడిలోని హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద పైపులు కాలిపోయిన ఘటనపై చర్చించారు. అమరావతిలోని భవన నిర్మాణ ప్రాంతాల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నిజంగానే ప్రమాదాలా, లేక వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే విషయాన్ని వెలికి తీయాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు సోమవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డిపార్టుమెంట్ అధికారులు.. మూడు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు ఇటీవలేజరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎల్అండ్‌టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు మంటల్లో కాలిపోయాయి. ఆ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ దర్యాప్తు పూర్తికాకముందే మరో అగ్నిప్రమాదం జరగటంతో.. వీటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరోవైపు అమరావతిలో హోం మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో పలు అనుమానాలను వంగలపూడి అనిత వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగిందన్న హోం మంత్రి అనిత.. దాన్ని ఓర్వలేక అమరావతిలో పైపులకు నిపు పెట్టారా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. గతంలో అమరావతిలో అరటితోటకు నిప్పు పెట్టిన ఘటనను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ చేయాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు. అమరావతిపై కుట్రలు పన్నితే సహించేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు.