ట్రంప్ తగ్గినా ఆగని యుద్ధం.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. ఏ జువెల్లరీల్లో గ్రాము గోల్డ్ రేటు ఎంతుందంటే?

Wait 5 sec.

: అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మార్చి 23న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడుల్ని 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. కాస్త శాంతించాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఊపిరిపీల్చుకుంది. ముందుగా యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి తగ్గిన బంగారం ధరలు.. కిందటి రోజు ఉదయం ఒకదశలో భారీగా తగ్గగా.. ట్రంప్ ప్రకటన తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజు ఒక దశలో . తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిందన్నమాట. 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ. 10 వేలకుపైగా తగ్గి చివరకు రూ. 2680 తగ్గింపుతోనే సరిపెట్టుకుంది. ఇక్కడ క్రూడాయిల్ ధరలు కిందటి రోజు భారీగా తగ్గడంతోనే మళ్లీ బంగారం, వెండి లోహాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు కనిష్ఠాల నుంచి మళ్లీ పెరిగాయన్నమాట. అయితే ఇది ఒక్కరోజుకే పరిమితమైంది. ట్రంప్ మంచి ప్రకటన చేసినా.. అంటే ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినా ఇరాన్- ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఆపట్లేదు. ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇది మార్చి 24న మళ్లీ క్రూడాయిల్ ధరలు పెరిగేలా చేసింది.బ్రెంట్ ముడి చమురు ధర కిందటి రోజు గరిష్ఠాల నుంచి 15 శాతం వరకు తగ్గి 95 డాలర్ల స్థాయికి పడిపోగా.. మళ్లీ ఇవాళ 5 శాతం వరకు పెరిగి 100 డాలర్లకు చేరింది. దీంతో మళ్లీ బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చేందుకు కారణమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో.. అదే విధంగా దేశీయంగా ధరల్ని తగ్గించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు మళ్లీ 4500 డాలర్ల స్థాయికి పెరగ్గా.. ఇప్పుడు 4380 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు 70 డాలర్లకుపైకి చేరి ఇప్పుడు మళ్లీ 68 డాలర్ల స్థాయిలో ఉంది. దీనికి అనుగుణంగా దేశీయంగా మళ్లీ ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. లలితా జువెల్లరీలో గ్రాము బంగారం ధర రూ. 35 తగ్గి ఇప్పుడు గ్రాముకు రూ. 13,100 వద్ద ఉంది. కిందటి రోజు గ్రాముకు ఒక దశలో రూ. 945 తగ్గగా చివరికి రూ. 245 తగ్గింపుతోనే సరిపెట్టుకుంది. తనిష్క్ గోల్డ్ జువెల్లరీలో గ్రాము పసిడి ధర రూ. 13,140 వద్ద ఉంది. ఖజానా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, జోయాలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్ వంటి వాటిల్లో చూస్తే గ్రాము గోల్డ్ ధర రూ. 13,100 వద్దే ఉంది. ఇలా ఉన్నప్పటికీ.. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లుపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. గోల్డ్ జువెల్లరీపై మేకింగ్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇంకా దీనిపైనా జీఎస్టీ 5 శాతం పడుతుంది.