Trending Stocks: ఈ వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే అని చెప్పాలి. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 2 మధ్య ఏకంగా 12 కంపెనీలు డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్‌ల కోసం ఎక్స్- ట్రేడింగ్ డేట్ కలిగి ఉన్నాయి. ఇందులో టీవీఎస్ మోటార్, ఐఆర్ఈడీఏ, క్రిసిల్ వంటి దిగ్గజ కంపెనీ ఉన్నాయి. రావడం, ఉన్న షేర్లు పదింతలు పెరగడం, డివిడెండ్ డబ్బులు వంటివి పొందేందుకు అర్హత లభిస్తుంది. మర ఆయా స్టాక్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్చి 30 స్టాక్స్టూ వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ (TVS Motor) ఒక్కో షేరుకు రూ. 12 చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని ఇటివలే ప్రకటించింది. ఇందు కోసం రూ. 570 కోట్లు కేటాయించింది. రికార్డు తేదీ మార్చి 31గా నిర్ణయించారు. అంటే మార్చి 30 మార్కెట్లు ముగిసే నాటికి కొనుగోలు చేసిన వారికి అర్హత లభిస్తుంది. Iఅంటే ఇన్వెస్టర్లు ఎన్ని షేర్లు కొంటే అన్ని షేర్లు ఉచితంగా బోనస్ రూపంలో లభిస్తాయి. మార్చి 30 వరకు కొనుగోలు చేసిన వారికే ఈ బోనస్ షేర్లు వస్తాయి. ట్రైటాన్ వాల్వ్స్ కంపెనీ 3:1 బోనస్ ఆఫర్ ప్రకటించింది. అంటే ప్రతి 1 షేరుకు మూడు అదనపు షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తుంది. అలాగే గుజరాత్ కాటెక్స్ కంపెనీ రైట్స్ ఇష్యూకి వెళ్తోంది.ఏప్రిల్ 2వ తేదీ స్టాక్స్ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏ (IREDA) ఒక్కో షేరుకు రూ. 0.6 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నవారికి ప్రయోజనం చేకూర్చనుంది. TVS హోల్డింగ్స్ కంపెనీ అత్యధికంగా ఒక్కో షేరుకు రూ. 86 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. చెన్నై పెట్రోలియం (CPCL) కంపెనీ ఒక్కో షేరుకు రూ. 8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఏప్రిల్ 25వ తేదీలోపు అర్హులైన షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది.రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (CRISIL) ఒక్కో షేరుకు రూ. 28 డివిడెండ్‌ను ఫైనల్ చేసింది. అలాగే ఆస్టర్ DM హెల్త్ కేర్ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 3 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. R&B డెనిమ్స్ కంపెనీ 1:2 బోనస్ షేర్ల సహా స్టాక్ స్ప్లిట్ (రూ. 2 నుంచి రూ. 1కి) సైతం ప్రకటించింది. సుందరం క్లేటన్ కంపెనీ ఒక్కోషేరుకు రూ. 4.50 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. B2B సాఫ్ట్‌వేర్ కంపెనీ డివిడెండ్ (రూ. 4.50), బోనస్ షేర్లు (1:2 రేషియోలో) అందిస్తున్నాయి.ఈ కంపెనీల నుంచి లాభాలు పొందాలనుకునే వారు ఎక్స్-డేట్ కంటే ఒకరోజు ముందే షేర్లు కొనుగోలు చేయాలి. కేవలం డివిడెండ్ కోసమే కాకుండా కంపెనీ ఆర్థిక బలాన్ని గమనించి ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాధారణంగా డివిడెండ్, బోనస్ ప్రకటించినప్పుడు ఎక్స్-డేట్ రోజు షేర్ ధర భారీగా తగ్గుతుంది. బోనస్ మొత్తానికి అనుగుణంగా షేరు ధరను సర్దుబాటు చేస్తారు.