రింకూ సింగ్‌కి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్.. క్యాప్ తీసి సలాం కొట్టిన సూర్యకుమార్ యాదవ్!

Wait 5 sec.

టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా ప్లేయర్లు ఇప్పుడు ఐపీఎల్ 2026లో అడుగుపెట్టబోతున్నారు. ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా పాత ప్లేయర్లంతా కలుసుకున్నారు. కేకేఆర్ స్టార్ రింకూ సింగ్‌ని చూసిన .. ఆప్యాయంగా పలకరించి, ఇటీవల వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ రావడంతో శుభాకాంక్షలు తెలిపాడు. ఆ వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ముందే వాంఖడే స్టేడియానికి చేరుకున్న కేకేఆర్ ప్లేయర్లతో ముంబై ఆటగాళ్లు కాసేపు ముచ్చటించారు. ఈ మ్యాచ్‌‌కి ముందు కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించాడు. దాంతో రింకూ సింగ్‌ను చూసిన సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ అంటూ పలకరించాడు. అంతటితో ఆగకుండా తన క్యాప్ తీసి సలాం కొట్టినట్టు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అలా చేస్తుండటంతో నవ్వుకున్నాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ కూడా గతంలో కేకేఆర్ తరఫున వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2017లో గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా చేశాడు. ఆ తర్వాత 2018 సీజన్‌కు ముందు సూర్యను కేకేఆర్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ తరఫునే ఆడుతూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2018లో రూ. 80 లక్షలకు కేకేఆర్ ఫ్రాంఛైజీతో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్.. 2025లో రూ. 13 కోట్లకు రిటైన్ అయ్యాడు. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి రింకూ సింగ్ సక్సెస్ ప్రస్థానం మొదలయ్యి.. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో భాగస్వామ్యం అయింది. ఇక రింకూ సింగ్‌ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ "రింకూ జట్టులో నాయకత్వ లక్షణాలను సంవత్సరాలుగా మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. భవిష్యత్‌లో రింకూ జట్టుకు ఆదర్శంగా నిలుస్తాడు, అందుకే ఈ బాధ్యతలు ఇచ్చాం. టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇది రింకూకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది" అని తెలిపాడు.