మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్కరోజే 2500 జంప్.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతకు చేరిందంటే?

Wait 5 sec.

Gold Rate Today: పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగులుతోంది. ఎందుకంటే గత రెండు రోజుల వరకు బంగారం రేట్లు భారీగా తగ్గాయి. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. యుద్ధం మరింత తీవ్రమవుతున్న తరుణంలో మరింత పడిపోతాయని కొనుగోలుదారులు భావించారు. కానీ, సడెన్‌గా సీన్ మారిపోయింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విభిన్న ప్రకటనలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇరాన్ విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తొలుత ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత 10 రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా పశ్చిమాసియాలో భారీగా బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. ఇరాన్ కథ ముగిస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో బులియన్ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీంతో తులం బంగారం రేటు ఒక్కోరోజే రూ.2500 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 110 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4493 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.85 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్సుకు 69.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో పసిడి రేట్లు రెండ్రోజుల్లో తులం బంగారం రూ.3500 పైన పెరిగింది. ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.2510 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,48,090 వద్దకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2300 మేర పెరిగింది. దీంతో తులం ఆభరణాల గోల్డ్ రేటు రూ.1,35,750 మేర పెరిగింది. రూ.5000 పెరిగిన వెండిబంగారంతో పాటు వెండి ధరలూ పెరుగుతున్నాయి. కిలో వెండి రేటు క్రితం రోజు రూ.15000 తగ్గి భారీ ఉపశమనం కల్పించినా ఈరోజు మళ్లీ ధరలు పెరిగాయి. ఇవాళ కిలో వెండి ధర రూ.5000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ.2,50,000 మార్క్ వద్దకు చేరింది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్చి 29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానికంగా పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.