అనుష్క శర్మ- విరాట్ కోహ్లి ఫ్లయింగ్ కిస్‌లు.. అబ్బబ్బా చిన్నస్వామిలో ఏం సీనూ..!

Wait 5 sec.

గ్రౌండ్‌లో ఉన్నాడంటే కెమెరా మ్యాన్ కళ్లన్నీ అనుష్క శర్మపైనే. కోహ్లి సిక్సర్లు కొట్టినా.. క్యాచ్ పట్టినా, సెలబ్రేషన్స్ చేసినా వెంటనే కెమెరా వైపు తిరుగుతుంది. వాళ్లిద్దరి బాండింగ్ అలాంటిది మరీ. పెళ్లికి ముందు నుంచి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వరకూ ఈ ఇద్దరి ప్రేమ బంధం ఏ మాత్రం మారలేదు. అదే లవ్.. అదే బాండింగ్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన .. తమ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తు చిత్తుగా ఓడించింది. ఇషాన్ కిషన్ విధ్వంసంతో 200 మార్క్‌ను అందుకున్న ఎస్ఆర్‌హెచ్.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. దేవదత్ పడిక్కల్ - విరాట్ కోహ్లి భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఐపీఎల్ 2025లో 657 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఈ సీజన్‌ను కూడా ఘనంగానే ఆరంభించాడు. తొలుత నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత క్లాస్ షాట్స్‌తో సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లి బౌండరీ కొట్టిన ప్రతిసారీ అనుష్క శర్మ ఆనందంతో గెంతులేస్తూనే ఉంది. 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. మ్యాచ్ ముగిసిన తర్వాత హెల్మెట్ తీసి తన సతీమణి అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనుష్క శర్మ కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరి బంధం ఇలానే కొనసాగాలని ఆశించారు. విరాట్ కోహ్లి - అనుష్క శర్మ ప్రస్తుతం లండన్‌లోనే సెటిల్ అయ్యారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరూ భారతదేశాన్ని విడిచి లండన్‌లోనే నివాసం ఉంటున్నారు. పిల్లల భవిష్యత్‌తో పాటు సెక్యూరిటీ దృష్ట్యా ఇంగ్లండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఏమైనా సిరీస్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నప్పుడే కోహ్లి ఇక్కడికి వస్తాడు.. ప్రాక్టీస్ సెషన్లు అవన్నీ కూడా లండన్‌లోనే చేస్తాడు.