Petrol Diesel Prices: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి మార్చి 26న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. . పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు గతంలో రూ. 13 గా ఉండగా.. దీనిని రూ. 10 తగ్గించి రూ. 3 కు చేర్చింది. ఇదే సమయంలో డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని అంతకుముందు రూ. 10 గా ఉండగా.. ఇప్పుడు మొత్తం ఎత్తివేసి జీరోకు చేర్చింది. ఈ ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించినా.. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది చమురు కంపెనీలకు మాత్రం కాస్త ఊరటనిస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధానికి ముందు క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన ఉండగా.. ఇప్పుడు అది 110 డాలర్ల స్థాయికి ఎగబాకింది. అయినప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచని క్రమంలో చమురు కంపెనీలే ఆ అదనపు భారాన్ని భరిస్తున్నాయి. ప్రస్తుతం . పెట్రోల్, డీజిల్ ధరల్లో చాలా వరకు టాక్స్‌లు ఉంటాయి. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ రూపంలో విధిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వాలు స్వల్పంగా వ్యాట్ (VAT) విధిస్తుంటాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలిసిస్ సెల్ (PPAC) ప్రకారం.. లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ. 21.90 కస్టమ్స్ డ్యూటీ విధిస్తుంది. ఇందులో రూ. 1.40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కాగా.. రూ. 13 స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీగా ఉంది. రూ. 2.50 అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌గా ఉంది. రూ. 5 రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌గా ఉంది. ఇప్పుడు సవరించిన తర్వాత చూస్తే పెట్రోల్‌పై మొత్తం ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ. 11.90 గా అయింది. ఇక్కడ పెట్రోల్‌పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 తగ్గించిన తర్వాత ఇలా మారింది. ఇక డీజిల్‌పై చూస్తే మొత్తం సుంకం రూపంలో రూ. 17.80 గా ఉండేది. రూ. 1.80 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, రూ. 10 అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ. 4 అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ ఉండగా.. రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూ. 2 గా ఉంది. ఇలా మొత్తం రూ. 17.80 గా ఉండగా.. ఇప్పుడు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 తగ్గించింది. దీంతో ఇది ఇప్పుడు రూ. 7.80 గా ఉంటుంది.ఇక అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT) విధిస్తుంటాయి. ఇది రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై వ్యాట్ రూ. 15.40 గా ఉంది. డీజిల్‌పై రూ. 12.30 గా ఉంది. ముంబైలో చూస్తే పెట్రోల్‌పై 25 శాతం, డీజిల్‌పై 21 శాతంగా వ్యాట్ ఉంది. కోల్‌కతాలో వరుసగా 25, 17 శాతంగా ఉన్నాయి.