ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కానే కాదు.. ఏడాదిలో ఇదే టాప్ స్కీమ్.. లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఎంతొచ్చిందంటే?

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్లు గత కొంత కాలంగా భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఒడుదొడుకులు ఇందుకు కారణం. ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా మాత్రం ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూస్తే ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని అందించిన వాటిల్లో ఉన్నాయి. ఇప్పుడు 2025, ఏప్రిల్ 1 నుంచి.. ఈ ఏడాది మార్చి వరకు కాసుల పంట పండించిన ఈక్విటీ గురించి తెలుసుకుందాం. వీటిల్లో 8 ఫండ్స్.. 50 శాతానికిపైగా రాబడి అందించాయి. ఈ మేరకు ఈటీమ్యూచువల్‌ఫండ్స్ డేటా చెబుతోంది. ఈ ఏడాది వ్యవధిలో మొత్తం 553 ఈక్విటీ ఫండ్స్ ఉండగా.. 253 మ్యూచువల్ ఫండ్స్ మాత్రం లాభాల్ని అందించాయి. వీటిల్లో 8 మాత్రమే 50 శాతానికి మించి రాబడి అందించాయి. మొత్తం 553 ఫండ్స్‌లో చూస్తే 64 సెక్టోరియల్ అండ్ థిమాటిక్ ఫండ్స్ కాగా.. 52 ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉన్నాయి. మరోవిషయం ఏంటంటే.. టాప్-8 ఫండ్స్ ఇంటర్నేషనల్ ఫండ్స్‌గానే ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా వంటి మ్యూచువల్ ఫండ్స్ నుంచే ఒక్కటి కూడా టాప్‌లో లేనే లేదు. వీటిల్లో నిప్పాన్ ఇండియా తైవాన్ ఈక్విటీ ఫండ్ అన్నింటికంటే ఎక్కువగా 158.46 శాతం రిటర్న్స్ ఏడాదిలోనే అందించి దుమ్ములేపింది. అంటే లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదిలోనే రూ. 2.58 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. దీని తర్వాతి స్థానంలో డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్మి ఎఫ్ఓఎఫ్ స్కీమ్ ఉంది. ఇది ఏడాదిలో 83.26 శాతం రాబడి ఇచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్ట్రాటజిక్ మెటల్ అండ్ ఎనర్జీ ఈక్విటీ ఎఫ్ఓఎఫ్ స్కీమ్ 69.93 శాతం రాబడి అందించింది. డీఎస్పీ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఓవర్సీస్ ఈక్విటీ ఓమ్మి ఎఫ్ఓఎఫ్ 69.53 శాతం మేర రిటర్న్స్ అందించింది. మిరే అసెట్ గ్లోబల్ ఎలక్ట్రిక్ అండ్ అటానమస్ వెహికిల్స్ ఈక్విటీ పాసివ్ ఎఫ్ఓఎఫ్ స్కీమ్ 58.25 శాతం మేర రిటర్న్స్ అందించింది. హెచ్‌ఎస్‌బీసీ బ్రెజిల్ ఫండ్ ఈ కాల వ్యవధిలో అంటే సంవత్సర కాలంలో 56.23 శాతం రిటర్న్స్ అందించింది. ఎడెల్‌వీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ అపార్చునిటీస్ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్ 55.28 శాతం మేర పుంజుకుంది. డీఎస్పీ యూఎస్ స్పెసిఫిక్ ఈక్విటీ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ చూస్తే ఇది కూడా ఏడాది వ్యవధిలో 50.59 శాతం మేర రాబడి అందించింది. మిగతా పాజిటివ్ రిటర్న్స్ అందించిన 245 ఫండ్స్ కనీసం 0.01 శాతం నుంచి 45.63 శాతం మేర పుంజుకున్నాయి. గమనిక: పైన ఇచ్చింది సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.