Hormuz Strait: హర్మూజ్‌ను తక్షణమే తెరవకుంటే ఆయిల్, విద్యుత్ కేంద్రాలు పేలిపోతాయి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Wait 5 sec.

ఇరాన్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలను ముగించే లక్ష్యంతో అక్కడి కొత్త, మరింత హేతుబద్ధమైన నాయకత్వంతో తాము తీవ్రమైన చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో హర్మూజ్ జల సంధిని తక్షణమే ఇరాన్ తెరవకుంటే తాము ఇప్పటి వరకూ టార్గెట్ చేయని చమురు మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. గతవారం చర్చలపై ప్రకటన చేసిన ట్రంప్.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు,‘‘ఇరాన్‌లో మా సైనిక కార్యకలాపాలను ముగించడానికి.. అక్కడి నూతన, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో అమెరికా తీవ్రమైన చర్చలు జరుపుతోంది.. ఇందులో గొప్ప పురోగతి సాధించాం.. కానీ ఏ కారణం వల్లనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే (బహుశా కుదురుతుంది కూడా), హర్మూజ్ జలసంధిని వెంటనే కార్యకలాపాలకు తెరవకపోయినా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ ద్వీపాన్ని ( బహుశా మేము ఉద్దేశపూర్వకంగా ఇంకా దాడిచేయని డీసాల్టినేషన్ ప్లాంట్లు!) పేల్చేసి, పూర్తిగా నాశనం చేస్తాం.. గత ఇరాన్ ప్రభుత్వ 47 ఏళ్ల భయానక పాలనలో మా సైనికులు, ఇతరుల హత్యలకు ప్రతీకార చర్యగా ఇది ఉంటుంది’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కూల్చేసింది. అమెరికాకు ఇది భారీ నష్టంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే గల్ఫ్‌లోని గగనతల థాడ్ క్షిపణి విధ్యంసక రక్షణ వ్యవస్థను ఇరాన్ నాశనం చేసింది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలో అమెరికాకు యుద్ధ విమానాలు, మందుగుండు, ఆయుధాలు సహా దాదాపు రూ.లక్ష కోట్ల మేర నష్టం జరిగింది. దీనికి సైనికుల రవాణా, ఇతర ఖర్చులు అదనం.