విజయ్ దేవరకొండతో పెళ్లి పుకార్లు.. ఇన్నాళ్లకు స్పందించిన నిహారిక కొణిదెల

Wait 5 sec.

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వసాధారణం. ఏ ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి కనిపించినా, వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని, డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని పుకార్లు పుట్టుకొస్తాయి. కొన్నేళ్లక్రితం - గురించి కూడా అలాంటి రూమరే ఒకటి వినిపించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వివాహం చేసుకోబోతున్నారని కథలు అల్లేశారు. ఈ పుకార్లపై తాజాగా నిహారిక స్పందించింది. మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'రాకాస' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నిహారిక.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి పుకార్లపై రియాక్ట్ అయింది. ఫిలిం ఇండస్ట్రీలో మ్యారేజ్ గురించిన రూమర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నడుస్తాయని వ్యాఖ్యానించింది. కొంతకాలం క్రితం తాను, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం చేశారని, 'సూర్యకాంతం' ఈవెంట్ వేదికగా విజయ్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారని తెలిపింది.''అప్పట్లో విజయ్ దేవరకొండ వెడ్స్ నిహారిక అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. 'సూర్యకాంతం' ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ.. 'నిహారిక నాకు సిస్టర్ లాంటిది' అని చెప్పారు. 'గీత గోవిందం' సినిమాలో మా నాన్న విజయ్ కి తండ్రిగా యాక్ట్ చేశారు. దాన్ని ఉద్దేశించి నిహారికకి కోసం అన్నలాగా వచ్చానని అన్నారు. స్టేజ్ మీదనే ఆ మాట చెప్పినందుకు థ్యాంక్యూ సోమచ్ అని చెప్పాను. కానీ ఆరోజు విజయ్ దేవరకొండ సిస్టర్ అని చెప్పడంతో, మా అన్నయ్యలతో పాటుగా ఇంకొకరితో కలిసి యాక్ట్ చేసే అవకాశం లేకుండా పోయింది'' అంటూ నిహారిక కొణిదెల నవ్వుతూ చెప్పింది. దీనంతటికీ జర్నలిస్టులే కారణమని సరదాగా వ్యాఖ్యానించింది. నాగబాబు ఏకైక కూతురైన నిహారిక.. గతంలో వెంకట చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా బిజీ అయిపోయింది. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు సాధించింది. ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా 'రాకాస' సినిమాని రూపొందించింది. ఇదే క్రమంలో తన సోదరుడు వరుణ్ తేజ్ తో 'బరి' అనే స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించనుంది. ఈ మధ్యనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. మరోవైపు విజయ్ దేవరకొండ ఇటీవలే రష్మిక మందనతో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ - రష్మిక కలిసి 'రణబాలి' అనే చిత్రంలో నటిస్తున్నారు.