ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. గత ప్రభుత్వ హయాంలో కేసుపై దాఖలైన మూడు పిటిషన్లు కొట్టివేత

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు అంశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును సీబీఐకి అప్పగించాలని, అలాగే గతంలో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణను ఏసీబీ కోర్టు నుంచి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని హైకోర్టు తెలిపింది.. వాటిని కొట్టివేసింది.ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు ఈ కేసు విచారణను బదిలీ చేయాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ కోర్టులో వాదించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు రోహత్గీ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న జరిగిన విచారణలో మరోసారి రోహత్గీ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ కేసు దర్యాప్తు పూర్తి చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్గీ. సీఐడీ ఏసీబీ కోర్టులో మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ కింద ఇప్పటికే తుది నివేదిక దాఖలు చేసిందని గుర్తు చేశారు. అలాగే అసాధారణ సందర్భాల్లో మాత్రమే సీబీఐకి కేసుల్ని అప్పగిస్తారని గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబుకులో రెండేళ్ల క్రితం బెయిల్ వచ్చిందని రోహత్గీ తెలిపారు. కోర్టు ముందు రికార్డులు ఉన్నప్పుడు బెయిల్ రద్దు ఎలా సాధ్యమన్నారు. అతాగే ప్రజా ప్రతినిధుల కోర్టుకు ఈ కేసును బదిలీ చేయాలని కోరే అర్హత పిటిషనర్‌కు లేదన్నారు.. మూడు పిటిషన్లు కొట్టేయాలని కోరారు. అంతకముందే పిటిషనర్ తరఫున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని కొట్టేసింది.