ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. హర్మూజ్‌ దిగ్బంధాన్ని పర్యవేక్షిస్తోన్న కమాండర్ మృతి

Wait 5 sec.

ఇజ్రాయెల్- అమెరికాతో జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. (IRGC) నావల్ కమాండర్ ఇజ్రాయెల్ దాడిలో మృతిచెందినట్టు ఆ దేశ మీడియా టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. హర్మూజ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న టాంగ్సిరి.. బందార్ అబ్బాస్ తీర ప్రాంతం వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయినట్టు పేర్కొంది. కాగా, దీనిపై ఇరాన్ లేదా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే గనుక ధ్రువీకరిస్తే ప్రస్తుతం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఇరాన్‌ మరో కీలక నేతను కోల్పోయినట్టే.అమెరికా, ఇజ్రాయెల్ హత్యాయత్నాలను ఇప్పటివరకు తట్టుకుని నిలబడిన అతికొద్ది ప్రముఖులలో టాంగ్సిరి ఒకరు. 2018 నుంచి బాధ్యతల్లో ఉన్న ఆయన ఒక అనుభవజ్ఞుడైన కమాండర్‌గా హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని దాదాపు టెహ్రాన్ మూసివేసింది. దీని కారణంగా చమురు, సహజవాయుడు రవాణా నిలిచిపోయి అంతర్జాతీయంగా సంక్షోభం నెలకుంది.నౌకాయాన పరిశ్రమ నిఘా వెబ్‌సైట్ లాలిడ్ లిస్ట్ ప్రకారం.. యుద్ధానికి ముందు హర్మూజ్ నుంచి రోజూ 120 నౌకలు ప్రయాణించేవి. కానీ, మార్చి 1 నుంచి 25 తేదీల మధ్య కేవలం 155 ట్యాంకర్లు మాత్రమే హర్మూజ్‌ను దాటాయి. ఇందులో 99 చమురు, గ్యాస్ ట్యాంకర్లు. అంటే 95 శాతం మేర నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా, యుద్ధంలో తమ అగ్రనేతలు ఒక్కొక్కరుగా మరణిస్తున్నా ఇరాన్ మాత్రం స్థైర్యాన్ని కోల్పోవడం లేదు. ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో దాడులు ప్రారంభించిన మొదటి రోజునేసహా ముఖ్య నేతలు, కమాండర్లు మరణించారు. దీంతో ఇరాన్ పని అయిపోయిందని అమెరికా సహా దాదాపు అన్ని దేశాలూ ఇదే అభిప్రాయానికి వచ్చాయి. కానీ, ఈ అభిప్రాయం తప్పని కొద్ది గంటల్లోనే తేలిపోయింది. ఇరాన్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనావేసి బోల్తాపడ్డాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు దాని మిత్రులైన గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను ఇరాన్ టార్గెట్ చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. ఈ వ్యూహం అమెరికాను ఆత్మరక్షణలో పడేయడంతో ట్రంప్ చర్చలకు దిగొచ్చారు. ఇరాన్‌తో ఒప్పందం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.