వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచిన నయారా ఎనర్జీ.. తక్షణమే అమల్లోకి

Wait 5 sec.

: భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ చమురు సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. వాహనదారులకు సడెన్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 5 చొప్పున.. అదే విధంగా డీజిల్‌పై లీటరుకు రూ. 3 చొప్పున పెంచేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంకా ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రాల్ని బట్టి గరిష్ఠంగా ఇది రూ. 5.30 గా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పెట్రోల్ పంపులు లక్షకుపైగా ఉండగా.. ఇందులో రష్యా చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ 6,967పెట్రోల్ బంకుల్ని ఆపరేట్ చేస్తోంది.అంతర్జాతీయంగా కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. మధ్యలో ఇజ్రాయెల్‌తో అమెరికా కూడా కలిసింది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి వద్ద చమురు, గ్యాస్ నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటుండగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇప్పటికే క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగింది. మార్చి 26న 3 శాతానికిపైగా పెరిగి 105 డాలర్ల వద్ద ఉంది. యుద్ధానికి ముందు ఇది 70 డాలర్ల దిగువన ఉండేది. ఈ కారణంగానే దేశీయంగా కూడా కంపెనీలు ధరల్ని పెంచాల్సి వస్తోంది.ఇటీవల . హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.35 మేర పెరిగింది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం వీటిల్లో యథాతథంగానే ఉన్నాయి. గత శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కూడా ఈ ప్రీమియం పెట్రోల్ ధరల్ని పెంచేశాయి. ఇంకా . ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సాధారణ పెట్రోల్ ధర లీటరుకు రూ. 107.50 పలుకుతోంది. ఇదే సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 95.70 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే .. ధరలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. . ప్రైవేట్ రంగ చమురు కంపెనీల్లో నయారా పెంచగా.. రిలయన్స్- బీపీ సంస్థ మాత్రం ధరల్ని పెంచలేదు. ఇది దేశవ్యాప్తంగా 2,185 అవుట్‌లెట్స్ నిర్వహిస్తోంది. మన దేశంలో దాదాపు 90 శాతం వరకు మార్కెట్ వాటా.. 3 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకే ఉంది.