తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నతన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న .. పెరంబూర్ స్థానంలో సోమవారం నాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఆయన పొందుపరిచారు. తన పేరున మొత్తం రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు రూ.115 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు వంటి ఉన్నట్టు పేర్కొన్నారు. తెలిసిందే.నగదు విషయానికి వస్తే విజయ్ వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద రూ.లక్ష ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో రూ.213 కోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఖరీదైన వాహనాల వివరాలను విజయ్ వెల్లడించారు. తన దగ్గర BMW 530,BMW I7, టయోటా లెక్సస్‌ 350, టయోటా వెల్‌ఫైర్‌ వంటి కార్లు ఉన్నట్లు తెలిపారు. మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ సూపర్‌ కూడా ఉందని విజయ్‌ అందులో పొందుపరిచారు. వీటి విలువ మొత్తం రూ.14.35 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద సుమారు రూ.1.20 కోట్ల విలువ చేసే 883 గ్రాముల బంగారం, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్టు విజయ్ వివరించారు. వీటితో పాటు రూ.198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో విజయ్ వెల్లడించారు. ఇందులో కొన్ని సొంతంగా కొనుగోలుచేసినవని, మరికొన్ని వారసత్వంగా సంక్రమించాయని తెలిపారు. ఇక, తన భార్య సంగీత పేరు మీద మాత్రం రూ.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తనకు ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేశారు. వడ్డీ, ఆస్తులు, స్వయం ఉపాధి నుంచి వచ్చే వడ్డీ, ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు.వరుసగా ఐదేళ్ల ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో విజయ్ పేర్కొన్నారు. 2024-25లో రూ.184.53 కోట్లు, అంతకు ముందు 2023-24లో రూ.105.69 కోట్లు, ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.198.71 కోట్లు, 2021-22 ఏడాదిలో రూ.237.46 కోట్లు, 2020-21లో మాత్రం కేవలం రూ.8.04 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఛారిటీ కింద వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీలకు రూ. 74 కోట్లకు పైగా అందించారు. ఇందులో కోకిలాంబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, గ్రీన్ లీఫ్ ఇన్ఫోటెక్‌లకు చెరో రూ. 20 కోట్ల చొప్పున ఇచ్చినట్టు తెలిపారు.ఇక, 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీని ప్రకటించిన విజయ్.. తన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలేనని అప్పట్లో ప్రకటించారు. ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనుండగా.. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. తమిళనాడులో చతుర్ముఖ పోరు నెలకుంది. విజయ్ పార్టీ టీవీకే, డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రంట్, అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీయే కూటమి, వీకే శశికళ కూటములు బరిలో నిలిచాయి. అయితే, ప్రధాన పోటీ మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.