చమురు ఎఫెక్ట్.. బంగారం ధరల్లో మార్పు.. తనిష్క్, మలబార్ సహా జువెలరీల్లో గోల్డ్ రేట్లు ఇవే!

Wait 5 sec.

22K Gold Rate: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చాలా దేశాలకు ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయి. దీంతో తీవ్రమైన ఇంధన కొరతకు గురవుతున్నాయి. అలాగే బంగారం ధరలు సైతం ఊహించని విధంగా మారిపోతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ గత రెండు రోజుల క్రితం వరకు పసిడి ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈరోజు సడెన్‌గా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 115 డాలర్లు దాటింది. రూపాయి ధర సరికొత్త జీవన కాల కనిష్ఠ స్థాయి 95 మార్క్ దాటేసింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఈరోజు 10 గ్రాములపై రూ.170 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,48,260 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.150 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,35,900 వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో మార్చి 30వ తేదీన తనిష్క్, మలబార్, లలితా జువెలరీ వంటి ప్రముఖ జువెలరీ సంస్థల్లో 22 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తనిష్క్ జువెలరీలో రేట్లుతనిష్క్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధరలు పెరిగాయి. 1 గ్రాము గోల్డు రేటు రూ.15 మేర పెరిగింది. దీంతో గ్రాముకు రూ. 13,630 వద్ద ట్రేడవుతోంది. ఇక తులం రేటు చూసుకుంటే రూ.150 మేర పెరిగి రూ.1,36,300 పలుకుతోంది. జొయాలుక్కాస్‌లోజొయాలుక్కాస్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి రేట్లు 1 గ్రాముకు రూ. 15 పెరిగి రూ. 13,590 వద్ద ట్రేడవుతోంది. ఇక 10 గ్రాముల బంగారు ఆభరణాల రేటు చూసుకుంటే రూ.150 పెరిగి రూ.1,35,900 వద్ద ట్రేడవుతోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోరూ. 15 పెరిగి రూ.13,685 వద్దకు దూసుకెళ్లింది. ఇక 10 గ్రాముల రేటు చూస్తే రూ.1,36,850 వద్ద ట్రేడవుతోంది. లలితా జువెలరీల్లోలలితా జువెలరీల్లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల తయారీ బంగారం) రేటు 1 గ్రాముకు రూ. 15 మేర పెరిగి రూ.13,685 వద్ద అమ్ముడవుతోంది. ఇక 10 గ్రాముల బంగారం రేటు చూసుకుంటే రూ.1,36,850 వద్ద అమ్ముడవుతోంది.