Unorganised Sector: అసంఘటిత రంగంలోని కార్మికులకూ సామాజిక భద్రతా పథకాలు అందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO), ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ESIC) సేవలను అందించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు తెలుసుకుందాం. 'పని చేసే ప్రతి ఒక్కరికీ పింఛను అందాలని, అందరినీ ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీల పరిధిలోకి తీసుకురావాలని ప్రధాన మంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులకు కూడా పింఛను సౌకర్యం కల్పించే దిశగా కార్మిక శాఖలో ప్రస్తుతం విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి' అని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ రంగంలో పని చేస్తున్న వారిని సైతం పింఛను పథకం పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించే అవకాశాలూ ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పింఛను పథకం ద్వారా కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంట్లో నుంచే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సదుపాయాన్ని ఇప్పటికే తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. , ఈపీఎస్, ఈఎస్ఐసీ వంటి సామాజిక భద్రతా పథకాలు అందుతున్నాయి. , వ్యవసాయ కూలీలు సహా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఎలాంటి భద్రతా పథకాలు లేవు. వారికి సైతం పింఛను అందించేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాలను కేంద్రం అందిస్తోంది. అటల్ పెన్షన్ యోజన వంటి కేంద్ర పథకాల ద్వారా 60 ఏళ్ల తర్వాత పింఛను ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అయితే, ఈపీఎఫ్, ఈఎస్ఐసీ వంటివి లేవు. ముందు ముందు ఈ పథకాలను సైతం అందించాలని కేంద్రం భావిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది.