కడపలో జరిగిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాాప్తంగా టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కడపలోనూ లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వేదికపైకి అతిథులను ఆహ్వానించే క్రమంలో కార్యక్రమానికి యాంకర్‌గా ఉన్న వ్యక్తి, తొలుత జిల్లా ఇంఛార్జి మంత్రి సవితను వేదికపైకి ఆహ్వానించారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్‌‍ను, ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవిరెడ్డిని స్టేజ్ పైకి పిలిచారు. దీనిపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటో‌కాల్ ప్రకారం మంత్రి తర్వాత తనను వేదికపైకి పిలవాలని.. ఇదేనా ప్రోటోకాల్ పాటించే విధానం అంటూ మండిపడ్డారు. మంత్రి తర్వాత స్థానిక ప్రజాప్రతినిధిగా తనను ఆహ్వానించకుండా అధికారులకు ప్రాధాన్యం ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యాంకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. నువ్వు యాంకర్‌ మాత్రమేనని.. తనకు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలంటూ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టుబట్టారు. దీంతో కార్యక్రమంలో వాతావరణం వేడెక్కింది. ఈ పరిణామాల మధ్యన జాయింట్ కలెక్టర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు గతేడాదివ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఈ ఘటనపై ఇటు ఎమ్మెల్యే, అటు అధికారులు కూడా స్పందించారు. తాను వెళ్లేసరికి వేదికపై తనకు కేటాయించిన సీటులో వేరే అతిథులు కూర్చున్నారని.. వారందరూ మన అధికారుల కుటుంబసభ్యులే కావటంతో.. వాళ్లను సీటులో నుంచి లేపడం మంచి పద్ధతి కాదనిపించి.. కాసేపు అక్కడే నిల్చుని కార్యక్రమం వీక్షించి వచ్చేసినట్లు మాధవిరెడ్డి తెలిపారు. అయితే ఇంత చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలంటూ మాధవిరెడ్డి సెటైర్లు కూడా వేశారు. అయితే పంద్రాగస్టు వేడుకలు మొదలైన గంటన్నర తర్వాత ఎమ్మెల్యే వచ్చారని.. వస్తున్నట్లు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని అప్పట్లో అధికారులు తెలిపారు. వీఐపీల కోసం కేటాయించిన సీట్లల్లో అప్పటికే ఇతరులు కూర్చున్నారని.. ఎమ్మెల్యే వచ్చిన వెంటనే వాళ్లను సీట్ల నుంచి ఖాళీ చేయించామని తెలిపారు. ఎమ్మెల్యేను అక్కడ కూర్చోవాలని కోరామని.. అయితే ముందుగానే వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించినప్పటికీ.. ఆమె కూర్చోకుండా కాసేపు నిలబడి వెళ్లిపోయినట్లు కడప కలెక్టర్ అప్పట్లో వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి ప్రోటోకాల్ వివాదంతో ఈ ఘటన మరోసారి చర్చకు వచ్చింది.