సినీ కొన్నాళ్లక్రితం డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచింది. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆమెపై తాత్కాలికంగా బ్యాన్ విధించి, కొన్ని రోజులకు నిషేధం ఎత్తేసింది. గతేడాది నవంబర్ లోనే తనపై ఉన్న డ్రగ్స్ కేసుని కోర్టు కొట్టేసిందని, తాను నిర్దోషిని అంటూ ఆమె ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తాజాగా హేమ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి, డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు మానసికంగా కలచివేశాయని, మీడియాలో వచ్చిన కొన్ని వార్తల వల్ల తన ఫ్యామిలీ చాలా సఫర్ అయిందని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ''ఆ సమయంలో చనిపోవాలనిపించింది. మానసికంగా చాలా కుంగిపోయాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిర్దోషిని. డ్రగ్స్ తీసుకుంటే నాకు శిక్ష వేసేవారు.. తీసుకోలేదు కాబట్టే నిర్దోషిగా బయటికి వచ్చా'' అని హేమ అన్నారు. డ్రగ్స్ టెస్టులకు సంబంధించిన రిపోర్టులను అప్పుడే తాను పబ్లిక్ గా బయటపెట్టానని.. ఒకేవేళ కోర్టు చట్టాలపై నమ్మకం లేకపోతే మీడియా వారు మళ్లీ టెస్టులు చేసుకోవచ్చని ఆరోజే చెప్పానన్నారు.బ్యాన్ గురించి హేమ స్పందిస్తూ.. ''కోర్టు జడ్జిమెంట్ రాకుండా ఎలా శిక్ష వేస్తారని 'మా' అసోసియేషన్ కి లెటర్ రాశాను. వారం రోజుల్లో నా మెంబర్షిప్ నాకు ఇచ్చేసారు'' అని చెప్పారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి తనకు సపోర్ట్ లభించిందని తెలిపారు. ''నాకు హెల్ప్ చేయడానికి గారు తన మనుషులను పంపించారు. ఇద్దరు ముగ్గురు హీరోలు, డైరెక్టర్లు నన్ను సపోర్ట్ చేశారు. మంచు విష్ణు బాబు కూడా నాకోసం ట్వీట్ కూడా చేశారు. అసోషియేషన్ లో మనం నచ్చనివాళ్లు, నచ్చినవాళ్లు ఉంటారు కనుక, ఏదో మిస్టేక్ జరిగింది. తర్వాత అంతా సర్దుకుంది. ఇండస్ట్రీ నుంచి నాకు వంద శాతం మద్దతు లభించింది. చిరంజీవి గారు తన నెక్స్ట్ సినిమాలో ఒక మంచి క్యారక్టర్ ప్రామిస్ చేశారు'' అని హేమ అన్నారు. "నేను నిర్దోషిని అని మొదటి నుంచీ చెబుతున్నాను. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను పార్టీలకు వెళ్తాను, నేను తిరుగుతాను.. తిరగనని చెప్పడం లేదు. నేను లైఫ్ లో ఎన్నో కష్టాలు చూశాను. ఇల్లు కిచెన్ షూటింగ్ తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అందుకే ఇప్పుడు నిజంగానే నా లైఫ్ లో చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడాన్ని కూడా ఒక బూతులాగా వేసేశారు. కానీ ఇది నా లైఫ్. నా ఇష్టం. అలా అని చట్టవిరుద్ధమైన పనులు నేను చేయలేదు'' అని హేమ చెప్పారు. ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేదికపై చిరంజీవి నంది అవార్డులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై హేమ స్పందిస్తూ.. చిరు మాట్లాడిన దాంట్లో తప్పేంలేదని అన్నారు. ''ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. సినిమాలు తీస్తే సబ్సిడీలు ఇస్తామని ఇండస్ట్రీని పిలిస్తే.. అక్కడా సినిమా షూటింగ్స్ ఎందుకు చేయరండీ. మేమందరం అక్కడికి వెళ్లడానికి రెడీగా కూడా ఉన్నాం. అదీ మాదే.. ఇదీ మాదే. రెండు రాష్ట్రాలు మావే. చిరంజీవి గారు మంచి మాటే అన్నారు. 'ఆర్టిసులను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు రెండు స్టేట్స్ గా డివైడ్ అయ్యాయి కదా.. ఆ రాష్ట్రంలో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుందనే' మంచి ఉద్దేశంతోనే చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా చిలవలు పలవలు చేసి, ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెట్టి మాట్లాడుతున్నారు'' అని హేమ చెప్పుకొచ్చారు.