ఇరాన్‌పై అమెరికా భూతలదాడికి దిగితే జరిగేది ఏంటి? ఈ నాలుగు అంశాలపైనే ఆందోళన

Wait 5 sec.

పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధం.. మరో మలుపు తీసుకోనుందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇప్పటికే 40 వేల మంది సైనికులు, యుద్ధ పరికరాలు, సామాగ్రి ఉండగా.. పశ్చిమాసియా దిశగా భారీ స్థాయిలో వాషింగ్టన్ సైనిక సమీకరణ కొనసాగిస్తోంది. అమెరికా అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ ప్రతిస్పందన దళాలల్లో ఒకటిగా పరిగణించే రెండు మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లు, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్, యూఎస్ఎస్ బాక్సర్, ట్రిపోలి ఏఆర్‌జీలు (ఆంఫిబియస్ రెడీ గ్రూప్) అదనంగా పశ్చిమాసియాకు చేరుకుంటున్నాయి. దాదాపు 57 వేల మంది సైనికులను అక్కడ మోహరిస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి.జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ వారం ప్రారంభంలో నార్ఫోక్ నుంచి పశ్చిమాసియాకు బయలుదేరిందని, పేరు వెల్లడించని ఇద్దరు వైట్ హౌస్ అధికారులు చెప్పినట్లు ఏబీసీ న్యూస్ పేర్కొంది. ఇది నిజమైతే, యూఎస్ఎస్ అబ్రహం లింకన్, జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్, బాక్సర్, ట్రిపోలితో పశ్చిమాసియాలో అమెరికాకు బలమైన నావికాదళ ఉనికి ఉంటుంది. వీటిలో ప్రతి ఒక్కటీ 20 వరకు ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్లు, ఎంవీ-22 ఆస్ప్రే అటాక్ హెలికాప్టర్లను మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని బట్టి ఇరాన్ చర్చలను ప్రతిపాదనను తిరస్కరించి, 400 కిలోల శుద్దిచేసిన యురేనియం అప్పగించడానికి నిరాకరిస్తే సైనిక బలగాలను మోహరించడానికి సిద్ధమవుతోందని అర్ధమవుతోంది.భూతల యుద్ధం.. సైనిక ప్రభావంభూతల దాడులను మొదలైతే యుద్దం ముగింపును ఊహించలేం. ఎందుకంటే నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. యుద్ధం మరింత విస్తరించి, ఇరాన్ ప్రాక్సీలైన యెమెన్‌లోని హౌతీ రెబల్స్, లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలోని హమాస్, ఇరాక్, బహ్రెయిన్‌లోని షియా మిలీషియా సహా అనేక ఫ్రంట్‌లలో అమెరికా దళాలు పోరాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇజ్రాయెల్ దాడులతో హెజ్బొల్లా బలహీనపడినా.. అది ఇంకా శక్తివంతమైన పోరాట దళంగానే ఉంది. ఖర్గ్ ద్వీపంలోని చమురు నిల్వలు, పొందడానికైనా భూతల దాడి సులభంగా ఉంటుందని అమెరికా ఆశించడం అవివేకమవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.యుద్ధం విస్తరించడం వల్ల ఇరాన్ ప్రాక్సీలు ఆకర్షితులవడమే కాకుండా, ఇప్పటివరకు రక్షణాత్మక వైఖరిని కొనసాగిస్తున్న ఇతర గల్ఫ్ దేశాలు కూడా అమెరికాతో మరింత సన్నిహితంగా చేరేందుకు ఒత్తిడి తీసుకొరావచ్చు. ఇప్పటివరకు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాలు తమ భూభాగాన్ని ఇరాన్‌పై క్షిపణి, వైమానిక దాడులకు ఉపయోగించలేదని చెబుతున్నాయి.ప్రపంచంపై ప్రభావంగత నెల 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన యుద్ధంలో ఇరాన్ ప్రతీకార చర్యలతో యావత్తు ప్రపంచం విస్తుపోయింది. అత్యంత చౌవకైన డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్ ఖరీదైన క్షిపణులు, రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకవేళ, ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యాలు అడుగుపెడితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుంది.ప్రస్తుత యుద్ధం కేవలం ఆయుధాలతోనే సాగడం లేదు. చౌకైన డ్రోన్లు, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు, సైబర్ దాడులు యుద్ధం తీరును మార్చేస్తున్నాయి. ఇరాన్‌లోకి అడుగుపెట్టే అమెరికా సైన్యాల ప్రాణాలు ముప్పు పొంచి ఉంది. వీరు సులభంగా డ్రోన్ దాడులకు గురయ్యే అవకాశం ఉండటంతో వందల మరణాలకు దారితీయవచ్చు. తన సైబర్ సామర్థ్యతో ప్రత్యర్థుల రక్షణ, సమాచార వ్యవస్థలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.చమురు సంక్షోభంప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్‌ దాదాపు మూసివేసింది. ప్రపంచంలో ఐదో వంతు ఆయిల్ దీని ద్వారానే రవాణా అవుతుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత చమురు ధరలు అమాంతం పెరిగి, అంతర్జాతీయ మార్కెట్‌లో సంక్షోభం దిశగా సాగుతోంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు 100 డాలర్లు దాటేయగా.. తీవ్రమైతే 150 డాలర్లుకు చేరుకుంటుందని, దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమైతే.. ఆ నష్టం అపారంగా ఉంటుంది. పునరుద్దరణకు కొన్ని దశాబ్దాలు పడుతుంది.మానవతా సంక్షోభంయుద్ధ నష్టాల్లో పెద్దది ప్రాణనష్టం. గత నెల రోజుల్లోనే యుద్ధం కారణంగా దాదాపు 4000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా ఇరాన్, లెబనాన్‌ ప్రజలే ఉన్నారు. ఇరాన్ యుద్ధంలో 4500- 5000 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది సామాన్యులు మరణించారు. ప్రస్తుత యుద్ధం అంతకు మించిన ప్రాణనష్టాన్ని మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిలియన్ల మంది నిరాశ్రయులైన పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ మానవతా సంక్షోభానికి దారితీస్తుంది.