తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్.. కృతజ్ఞత చాటుకున్న విజయ్..

Wait 5 sec.

తమిళనాడు రాజకీయాలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న , తలపతి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు విజయ్. సుదీర్ఘ కాలంగా తన వ్యక్తిగత కారు డ్రైవర్‌గా అత్యంత నమ్మకంగా పనిచేస్తున్న రాజేంద్రన్‌పై కృతజ్ఞతను చాటుకుంటూ రాజేంద్రన్ కుమారుడు శబరీనాథన్‌కు టీవీకే తరుఫున ఎమ్మెల్యే టికెట్ ఇస్తు్న్నట్లు విజయ్ ప్రకటించారు. దీంతో రాజేంద్రన్, అతని కుమారుడు శబరీనాథన్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్‌ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. తన నిర్ణయం ద్వారా తన వెన్నంటి ఉండేవారికి, సామాన్య కార్యకర్తలకు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామనే సంకేతాన్ని విజయ్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తు్న్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం చెన్నైలో జరిగిన సభలో టీవీకే అభ్యర్థుల జాబితాను విజయ్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికల్లో చేస్తున్నారు.దిగుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్.. టీవీకే పార్టీ అభ్యర్థులు ప్రజా రక్షకులుగా అభివర్ణించారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే పార్జీ విజయం సాధిస్తే.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని.. అవినీతిని అణిచివేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితులలోనూ విఘాతం కల్గించమన్న విజయ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రజలను కోరారు. ఇక చెన్నైలో జరిగిన కార్యక్రమంలో టీవీకే అభ్యర్థులు 234 మందిని విజయ్ ప్రజలకు పరిచయం చేశారు. మరోవైపు ఉత్తర, సెంట్రల్ తమిళనాడులో ప్రభావం చూపేలా.. విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికలు టీవీకేకు, అధికార డీఎంకేకు మధ్యనే అని విజయ్ మరోమారు స్పష్టం చేశారు. ఇక ప్రకటించింది. స్కూలు, కాలేజీలలో యాంటీ డ్రగ్ యూనిట్స్, 20 లక్షల వరకూ విద్యా రుణం, నిరుద్యోగ భృతి కింద డిగ్రీ ఆపైన చదివిన వారికి నెలకు రూ.4000 వంటి హామీలు ఇచ్చింది.