"మ్యాచ్‌ని మలుపుతిప్పిన క్యాచ్‌కి క్రెడిట్ లేదా?" దినేష్ కార్తీక్ పోస్టుపై షేమ్ అంటూ సాల్ట్ రియాక్షన్!

Wait 5 sec.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో పట్టిన క్యాచ్‌లు ఐపీఎల్ బుక్‌లో నిలిచిపోతాయి. ఆరంభ మ్యాచ్‌లోనే గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచెత్తో పట్టిన క్యాచ్ అయితే హైలెట్. ఆ క్యాచ్‌లపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు అందిస్తుంటే.. ఆర్సీబీ మాస్టర్ మైండ్‌గా పిలిచే మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఫీలయిన ఫిల్ సాల్ట్ నేరుగా ఆ పోస్టు కిందే షేమ్ అంటూ కామెంట్ చేసేశాడు. ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అందించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. దాంతో దినేష్ కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాచ్ స్పెషల్ ఫొటోలతో ఛాంపియన్స్ పర్ఫెక్ట్ స్టార్ట్ అంటూ పోస్ట్ చేశాడు. డీకే పోస్ట్ చేసిన ఆరు ఫొటోల్లో ఒక్కటి కూడా ఫిల్ సాల్ట్ క్యాచ్ లేదు. దాంతో డీకే పోస్ట్ కిందే ఫిల్ సాల్ట్ కామెంట్ చేశాడు. "మాస్టర్‌మైండ్.. క్యాచ్‌కి చోటు లేదా? షేమ్" అంటూ ఫిల్ సాల్ట్ కామెంట్ పెట్టాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ కూడా మాస్టర్ మైండ్ అంటూ రెండు చేతులతో దండం పెట్టే సింబల్‌తో ఇంకో కామెంట్ చేశాడు. దాంతో ఇప్పుడు ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, జాకబ్ డప్ఫీ, కెప్టెన్ రజత్ పటిదార్ ఫొటోలతో పాటు టీమ్ సెలబ్రేషన్ ఫొటో మాత్రమే డీకే పోస్టులో ఉన్నాయి. ఇక స్పెషల్ క్యాచ్‌ల విషయానికి వస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించడంలో ఫిల్ సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఎస్ఆర్‌హెచ్ అరివీర భయంకర బ్యాటర్లయిన ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లను ఫిల్ సాల్టే అందుకున్నాడు. క్లాసెన్, ఇషాన్ క్యాచ్‌లు మాత్రం చాలా స్పెషల్. అందులోనూ ఇషాన్ కిషన్ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఫ్ సైడ్ పాయింట్ మీదుగా ఇషాన్ కిషన్ గాల్లోకి లేపిన క్యాచ్‌ని ఫిల్ సాల్ట్ పరిగెత్తుతూ వెళ్లి ఒంటి చేత్తో అందుకున్నాడు. అసాధ్యమైన ఆ క్యాచ్‌ను అందుకున్న ఫిల్ సాల్ట్‌‌ను చూసి విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ స్టన్నయ్యారు. కామెంటేటర్లు కూడా అవాక్కయ్యి అస్సలు ఊహించలేదన్నారు. ఆ క్యాచ్ మిస్సయ్యుంటే ఇషాన్ సెంచరీ చేయడంతో పాటు స్కోర్ బోర్డు కూడా ఇంకా ముందుకెళ్లేది. అందుకే మ్యాచ్‌నే మలుపు తిప్పిన క్యాచ్‌ను తన పోస్ట్‌లో చేర్చకపోవడంతో ఫిల్ సాల్ట్ డిజప్పాయింట్ అయ్యి షేమ్ అంటూ కామెంట్ చేశాడు.