'కేసీఆర్, హరీష్ రావును 2 రోజుల్లో జైల్లో పెడతామన్నారు.. ఏమైంది': రేవంత్ రెడ్డి

Wait 5 sec.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వివిధ అంశాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన .. గత ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. అందులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని పేర్కొన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కేవలం తాము మాత్రమే ఆరోపించలేదని.. స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు.కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావులను 48 గంటల్లో జైల్లో పెడతామని చెప్పిన మాటలను ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, బీజేపీ నేతల మాటలు తాము నమ్మి ఈ కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించినట్లు చెప్రారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి.. 48 గంటలు కాదు.. ఎన్ని నెలలు గడిచిందో రాష్ట్ర ప్రజలు అంతా చూశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతినపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటై లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో కేసీఆర్, హరీష్‌ రావును జైల్లో పెట్టిన తర్వాత బీజేపీ నేతలు తమ ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి.. మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ధరణి పోర్టల్ ద్వారా వందల ఎకరాల భూమిని తన పేరు మీద బదలాయించుకున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒప్పుకుంటే.. ఆ ఘటనపై హౌస్ కమిటీ వేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హరీష్ రావు నిజాయితీపరుడు అని.. కేటీఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోండి అంటూ రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.