ప్రముఖ నటుడు పార్టీ టీవీకే బరిలో నిలవడంతో.. ఈసారి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. విజయ్‌తో పొత్తు కోసం ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ మాత్రం ఒంటరి పోరుకు మొగ్గు చూపారు. అంతేకాదు . చెన్నై శివార్లలోని పెరంబూర్‌తోపాటు సెంట్రల్ తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు.పెరంబూరు నియోజకవర్గంలో వర్కింగ్ క్లాస్ జనాభా ఎక్కువ. ఇక్కడ తెలుగు ప్రజలు, తెలుగు మూలాలు ఉన్న జనం కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి డీఎంకేకు చెందిన ఆర్.డి. శేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయ్‌కు శేఖర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే ఈ సీటును పీఎంకేకు కేటాయించింది.సెంట్రల్ తమిళనాడులోనూ పట్టు సాధించడం కోసం విజయ్.. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు, ముఖ్యంగా వెల్లాలర్ వర్గానిక చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పట్టణ ప్రాంతానికి చెందిన వారు నాలుగో వంతు ఉంటారు. ప్రస్తుతం తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా డీఎంకే పార్టీకి చెందిన ఎస్.ఇనిగో ఇరుదయరాజ్ ఉన్నారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అయిన క్రీస్తువ నెల్లెన్న ఇయక్కమ్‌ను ఆయన ఏర్పాటు చేశారు. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే మంత్రి వెల్లమండి నటరాజన్‌ను ఇనిగో ఓడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం వ్యూహాత్మకంగా, సెంటిమెంట్ పరంగా కీలకమైంది. 2011లో డీలిమిటేషన్ జరిగిన నాటి నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.తమిళనాట విజయ్ వేస్తున్న అడుగులు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ గుర్తుకు రాకమానరు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేశారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, రాష్ట్రంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. ఆ ఎన్నికల్లో . విశాఖపట్నంలోని గాజువాకతోపాటు.. కాపులు ఎక్కువగా ఉండే భీమవరం నుంచి జనసేనాని పోటీ చేశారు. అప్పుడు పవన్ పోటీ చేసిన గాజువాకలో, ఇప్పుడు విజయ్ బరిలోకి దిగుతున్న పెరంబూర్‌లో శ్రామిక జనాభా ఎక్కువ. . ఇప్పుడు విజయ్ పోటీ చేస్తున్న తిరుచ్చి ఈస్ట్‌కి కూడా ఈ సెంటిమెంట్ ఉంది. పవన్ కళ్యాణ్‌కు లాగే విజయ్‌కు కూడా యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్‌కు ఏపీలో బలమైన కాపు సామాజికవర్గం అండగా ఉంటే.. తమిళనాడులో విజయ్‌కు క్రిస్టియన్లు అండగా ఉంటున్నారనే అంచనా ఉంది. అయితే 2019 ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న విజయ్.. తమిళనాడులో ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ పార్టీ గనుక 25 శాతానికిపైగా ఓట్లు సాధిస్తే.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంది. మరి విజయ్ కింగ్ అవుతారా లేదా కింగ్ మేకర్ అవుతారా? లేదంటే ప్రధాన పార్టీల మధ్య నలిగిపోతారా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.