ఇరాన్ వార్‌తో సీన్ రివర్స్.. లోన్లు తీసుకునేవారికి 'ఆర్బీఐ' బ్యాడ్‌న్యూస్.. ఏడాది పాటు ఇవే వడ్డీ రేట్లు?

Wait 5 sec.

: దేశంలో ఇప్పుడు పరిస్థితి ఏమంత బాగోలేదు. అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో.. ముఖ్యంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు దేశాల్లో గ్యాస్, చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయి. క్రూడాయిల్ ధర మళ్లీ బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును చేరింది. ఇది ద్రవ్యోల్బణం భయాల్ని పెంచుతోంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలుతున్నాయి. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలకు పడిపోతోంది. మ్యూచువల్ ఫండ్లలోనూ తీవ్ర నష్టాలు వస్తున్నాయి. దీంతో ఆర్బీఐ ప్రస్తుత పరిస్థితుల్లో కీలక రెపో రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 5.25 శాతం వద్దే చాలా కాలం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఆర్బీఐ వడ్డీ రేట్లను ఈ ఏప్రిల్ 6-8 సమావేశం నుంచి చూస్తే వచ్చే ఏడాది మధ్య కాలం వరకు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని.. యథాతథంగానే ఉంచనుందని రాయిటర్స్ తాజా సర్వేలో పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ద్రవ్యోల్బణం పరిస్థితుల దృష్ట్యా.. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు తదుపరి ఆర్బీఐ సమీక్ష 2026 ఏప్రిల్ 6-8 తేదీల్లో జరగనున్నాయి. అప్పుడు కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చకపోవచ్చనే మెజార్టీ సంఖ్యలో ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. చివరిసారిగా గతేడాది డిసెంబరులో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటులో ఆర్బీఐ కోత విధించింది. ఆ ఏడాది ఒక్కసారే కాదు.. ఏకంగా 4 సార్లు కలిసి మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధించింది. .గతేడాది జనవరిలో 6.50 శాతం వద్ద గరిష్ఠ స్థాయిల్లో ఉండగా.. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించగా.. జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మళ్లీ డిసెంబరుతో కలిపి 225 బేసిస్ పాయింట్లు తగ్గగా.. ప్రస్తుతం 5.25 శాతం వద్ద ఉంది. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తే.. లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు. హోం లోన్, వెహికిల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గుతుంటాయి. దానికి అనుగుణంగా లోన్ ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గించుకోవచ్చు. కానీ ప్రస్తుత అంచనాలు వడ్డీ రేట్లను మార్చబోదని చెబుతుండగా.. ఈ లోన్లు తీసుకునేవారికి దాదాపు ఏడాది పాటు వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిల్లోనే (ప్రస్తుత స్థాయిలో) ఉండొచ్చు. దీంతో ఈఎంఐలు కూడా తగ్గే అవకాశాలు కనిపించట్లేదు. వరుసగా తగ్గుతూ రాగా.. ఇంకా తగ్గుతాయని భావిస్తుండగా.. ఇది చాలా మందికి నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు.