ట్రంప్ దెబ్బకు.. భారీగా పెరిగిన బంగారం ధర, వెండి రూ.10000 జంప్.. ఈరోజు రేట్లు ఇవే

Wait 5 sec.

Gold Rate Today: పసిడి ప్రియులకు సడెన్ షాక్ తగిలింది. వారం రోజుల నుంచి వరుసగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న అంచనాలు, ప్రెసిడెంట్ ట్రంప్ విరామం ప్రకటనతో చమురు ధరలు భారీగానే దిగివచ్చాయి. బ్యారెల్ ముడి చమురు 100 డాలర్లలోపునకు దిగివచ్చింది. ఈ క్రమంలో బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడం, డాలర్ విలువ పెరిగిన క్రమంలో అయితే, యుద్ధం ఆగిపోయిందన్న ప్రకటనలతో బాండ్ ఈల్డ్స్ నుంచి పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. పసిడికి ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో ధరలు పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లో మార్చి 26వ తేదీన 22, 24 క్యారెట్ల బంగారం రేటు ఎంతకు పెరిగిందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 135 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4535 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 3.91 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ 72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వారం రోజుల తర్వాత భారీగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి రూ.3760 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,46,670 వద్దకు ఎగబాకింది. దీంతో తులం ధర రూ.1,34,450 వద్దకు చేరుకుంది. రూ.10 వేలు పెరిగిన వెండిబంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పెరిగింది.రెండు రోజుల వ్యవధిలోనే రూ.30 వేలు ఎగబాకింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరగడంతో కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.2,60,000 స్థాయికి చేరుకుంది. పైన చెప్పిన బంగారం, వెండి ధరలు మార్చి 26వ తేదీన గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి ఇక్కడ సూచించడం జరిగింది. అయితే, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులు స్థానికంగా ధరలు కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.