మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల దగ్గర చీమకుర్తి వైపు నుంచి కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరుకు చెందినవారిగా చెబుతున్నారు. అందరూ చూస్తుండగానే బస్సు మంట్లలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పేసి.. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.