భద్రాచలం ఆలయానికి మహర్దశ.. రూ.586 కోట్లతో అభివృద్ధి, మొత్తం మూడు దశల్లో పనులు

Wait 5 sec.

తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పట్టనుంది. రూ.586 కోట్లతో 3 దశల్లో రామాలయం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. అభివృద్ధి పనులకు తొలివిడత నిధులు మంజూరు చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం రామాలయం పునరాభివృద్ధికి చేయనున్నారు. భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటిదశలో గోదావరి ఘాట్‌ అభివృద్ధి, ఆలయ పరిసరాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల పనుల్ని చేపట్టనున్నారు. ఈ పనుల కోసం గోదావరి ఘాట్‌కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. రెండో దశలో ఆలయం సమీపంలో అభివృద్ధి పనులు, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పనులు 2026లోనే మొదలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది భద్రాచలం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ సమగ్ర అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల్ని ఆగమ శాస్త్రానికి అనుగుణంగా చేపడతామని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, క్షేత్రవైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి కొత్త శోభ లభించడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాగితాలతే పరిమితం.. ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. ఆలయ ప్రాకారాల విస్తరణ, మాడ వీధుల నిర్మాణం, గోదావరి తీరాన్ని సుందరీకరించడం వంటి ప్రణాళికలు రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనుల్లో వేగం కనిపించలేదు. కేటాయింపులు జరిగినప్పటికీ సాంకేతిక కారణాలు, భూసేకరణ ఇబ్బందుల వల్ల ఆ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది ఆలయాన్ని సందర్శించిన ఆయన, భద్రాద్రి వైభవాన్ని చాటిచెప్పేలా సమగ్ర అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ తాజాగా నిధులు కేటాయించారు.