బ్యాంకింగ్, విద్య, ట్రావెలింగ్ వరకు... ఏప్రిల్ నుంచి దుబాయ్‌లో భారీ మార్పులు

Wait 5 sec.

, విద్య, ట్రావెల్, రెసిడెన్సీ నిబంధనల్లో కీలక మార్పులను అమల్లోకి తీసుకురానుంది. పాలసీ సర్దుబాట్లలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీటిని యూఏఈ అమలుచేయనుంది. ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత కొనసాగినప్పటికీ దుబాయ్ ఒక సురక్షితమైన నగరంగా పెట్టుబడిదారులకు కనిపించేది. ఆస్తుల కొనుగోలు, అద్దెలపై పన్ను లేకపోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఇది ఆకర్షించింది.వివిధ దేశాల నుంచి వచ్చిన లక్షల మంది ప్రవాసులకు దుబాయ్‌ ఆశ్రయం కల్పిస్తోంది. ఆ నగర జనాభాలో ఎమిరేట్స్ కేవలం 10 శాతం మాత్రమే. కానీ, ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం దుబాయ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓటీపీలకు చెల్లుచీటిబ్యాంకింగ్‌ రంగంలో ఓటీపీలకు గుడ్‌బై చెబుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో బ్యాంకులు అధిక మొత్తంలో లావాదేవీలకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా వచ్చే ఓటీపీలను పూర్తిగా ఎత్తివేయనుంది. గతేడాది జులైలో యూఏఈ కేంద్ర బ్యాంకు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని స్థానంలో అథెంటికేషన్ తీసుకొచ్చారు. కస్టమర్లు తమ బ్యాంకు మొబైల్ యాప్ ద్వారా అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఆన్‌లైన్ షాపింగ్, క్యూర్ కోడ్ చెల్లింపుల్లో ఓటీపీలను ఎక్కువగా వినియోగించేవారు.విద్యా సంస్థల్లో ఆఫ్‌లైన్ తరగతులు షూరుప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో మార్చి 23 నుంచి కనీసం రెండు వారాల పాటు ఆన్‌లైన్ తరగతుల విధానం అమల్లోకి వచ్చింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం.. ఏప్రిల్ 3 వరకు డిస్టెన్స్ లెర్నింగ్ విధానం కొనసాగుతుంది. ఆ తర్వాత విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాల్సి ఉటుంది. పరిస్థితిని అధికారులు వారానికొకసారి సమీక్షిస్తారు.విమాన సర్వీసులు పునరుద్దరణఅమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల్లోని విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని ఎయిర్‌లైన్స్ సేవలను నిలిపివేశాయి. దీంతో ఏప్రిల్ నుంచి కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునఃప్రారంభించనున్నట్టు యూరో న్యూస్ తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఎయిర్‌ఫ్రాన్స్, మార్చి నెలాఖరు వరకు సర్వీసులు నిలిపివేసిన తుర్కియే ఎయిర్‌లైన్స్ కూడా సేవలను ప్రారంభించే ప్రణాళికలో ఉన్నాయి. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ఆయా ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.గడువు ముగిసిన పర్మిట్లు ఉన్న నివాసితులు కొత్త పర్మిట్ లేకుండానే యూఏఈలోకి అనుమతించే తాత్కాలిక నిబంధన 2026 మార్చి 31న ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి సాధారణ రెసిడెన్సీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దేశంలోకి ప్రవేశానికి చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరి.