, మాజీ ప్రధాని ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. పాక్‌కు వరల్డ్‌కప్ అందించిన హీరో ఇప్పుడు జైలు జీవితంలో మగ్గుతున్నాడు. రోజురోజుకూ అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండటంతో ఇటీవలే పాత కెప్టెన్లంతా కలిసి పాకిస్తాన్ గవర్నమెంట్‌కి కూడా ఒక లేఖ రాశారు. ఆ తర్వాత ఇప్పుడు టీ షర్ట్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకునేలా చేసింది. ఆ వివాదం ఎంత వరకు వెళ్లిందంటే చివరకు క్రికెట్ ఆస్ట్రేలియానే నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ వార్త ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ మ్యాచ్ మొదటి రోజున ల్యూక్ బ్రౌన్ అనే అభిమాని ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ అని ఉన్న టీ షర్ట్ వేసుకుని స్టేడియానికి వచ్చాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకుని, అభిమానిని లోపలికి అనుమతించలేదు. ఆ టీషర్ట్ తీసేస్తేనే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో దీనిపై స్పందించింది. తొలుత సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న క్రికెట్ ఆస్ట్రేలియా, ఆ తర్వాత కూలంకషంగా సమీక్షించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని కావడంతో తొలుత ఇది రాజకీయ కోణంలో చూడాలని చెప్పినా, ఆ తర్వాత అది మాజీ క్రికెటర్ అందులోనూ అనారోగ్య పరిస్థితుల్లో జైలులో ఉన్నందున మానవతా కోణంలో చూడాలని నిర్ణయించింది. దాంతో ఆ అభిమానిని మళ్లీ స్టేడియంలోకి వెళ్లేందుకు అనుమతిచ్చారు. ఈ విషయంపై స్పందించిన అభిమాని ల్యూక్ బ్రౌన్ తనను అడ్డుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పాడు. సెక్యూరిటీ నిబంధనలు తనకు అర్థమవుతున్నా, అడ్డుకోవడం సరైన నిర్ణక్ష్ం కాదన్నాడు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలవాలని పేర్కొన్నాడు. మొత్తానికి రావల్పిండి అదియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించడంతో, అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తమవ్వడం విశేషం.