?: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రోజు కీలక ప్రకటన చేసింది. దేశంలో మరోసారి విధిస్తారన్న వదంతుల్ని కొట్టిపారేసింది. లాక్‌డౌన్ విధిస్తారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. అలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో (X) ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 'భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న రూమర్స్.. పూర్తిగా అవాస్తవం. భారత ప్రభుత్వం దీని గురించి అస్సలు ఆలోచించట్లేదు. అసలు ఇలాంటి ప్రతిపాదన కూడా లేదు.' అని పురీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వదంతుల్ని వ్యాప్తి చేసి.. జనాల్లో ఆందోళన కలిగించొద్దని.. ఇది ఏమాత్రం సరైనది కాదని మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతా ఐక్యంగా.. ప్రశాంతంగా.. బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా కూడా ఇరాన్‌పై దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ వీటితో పాటు సమీప గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడుతోంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు కీలకంగా ఉన్న హర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్.. చమురు నౌకల్ని అడ్డుకుంటుండగా సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే పలు దేశాల్లో ఇప్పటికే నిల్వలు నిండుకుంటున్నాయి. ధరల్ని కూడా పెంచుతున్నాయి. భారత్‌లో వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరగ్గా.. ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు.. పెట్రోల్ కొరత ఉందన్న భయాలతో వాహనదారులు పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు లాక్‌డౌన్ విధించినట్లుగా.. ప్రస్తుత పరిస్థితుల్లో తెరపైకి వచ్చాయి. ఇక్కడ కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇంధన వాడకాన్ని బలవంతంగా తగ్గించేందుకు ఆంక్షలు విధిస్తుందని భావించారు. మరోవైపు.. మార్చి 27న ఈ భయాలు మరింత ఎక్కువయ్యాయి. మోదీ.. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో సమీక్ష నిర్వహించనున్నారు. అప్పట్లో కొవిడ్ సమయంలోనూ ఇలాగే సీఎంలతో సమావేశం నిర్వహించి లాక్‌డౌన్ విధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే.. తాజాగా పురీ దీనిపై స్పష్టత ఇచ్చారు. లాక్‌డౌన్ ఏం విధించబోదని పేర్కొన్నారు. ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఐదో వారానికి చేరుకోగా.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయని.. అనిశ్చితి నెలకొందని పేర్కొన్న పురీ.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇంధనం, సరఫరా వ్యవస్థ, నిత్యావసర వస్తువుల సప్లైని చూస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. ఇంధనం, విద్యుత్ ఇతర కీలకమైన సరఫరాలు నిరంతరాయంగా లభించేలా చూసేందుకు అన్ని రకాల అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.