చనిపోయిన మా నాన్నే కుక్కలా పుట్టారు.. ఆ కుక్కే నా కన్నీళ్లను తుడుస్తుంది: రీతూ చౌదరి

Wait 5 sec.

ఖమ్మం నుంచి సిటీకి వచ్చి ఖతర్నాక్ పోరీ అనిపించుకుంది రీతూ చౌదరి. యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి సీరియల్స్‌లో నటించి.. చివరికి బిగ్ బాస్ షోతో క్రేజ్ దక్కించుకున్న ఇప్పటి వరకూ సినిమాలైతే చేయలేదు కానీ.. సినిమా ఆర్టిస్ట్‌లను మించి పాపులారిటీ దక్కించుకుంది. ఇక వివాదాల్లోనే ముందుండే రీతూ చౌదరి.. ప్రేమ, పెళ్లి, విడాకులు, కోట్ల ఆస్తులు ఇలా చాలా విషయాల్లో వెలుగులోకి వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో డెమాన్ పవన్‌తో రొమాన్స్‌ని గట్టిగా దట్టించి వార్తల్లో నిలిచింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కుక్కలంటే అమితంగా ఇష్టపడే రీతూ చౌదరి ఇంట్లో క్యాస్పర్, కోకో అనే రెండు శునకాలు ఉన్నాయి. మనుషులతో ఉండే బంధం కంటే ఆ కుక్కలతో ఉండే బంధమే ఎక్కువంటూ.. చనిపోయిన తన తండ్రే కుక్కరూపంలో పుట్టాడంటూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది రీతూ చౌదరి.నేను కూడా పెట్ లవర్‌ని. మూగ జీవాల కోసం రేణుదేశాయ్, రష్మిలు చేసిన ఫైట్‌లో న్యాయం ఉంది. ఒక్క డాగ్ ఎవర్నో కరిచిందని మొత్తం డాగ్స్‌ని చంపేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక అబ్బాయి రేప్ చేశాడని అందర్నీ చంపేస్తే ఎలా ఉంటుంది. ఒక డాగ్ ఏదో చేసిందని అన్ని డాగ్స్‌ని చంపేయడం తప్పు. నేను రెండు డాగ్స్‌ని పెంచుకుంటున్నా. చిన్నప్పటి నుంచి వాటిని పెంచడం వల్ల వాటితో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మనుషులతో కూడా అంత బాండింగ్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ.. కుక్కలతో వచ్చింది. ఒక డాగ్ నుంచి అన్ కండిషన్ లవ్ వస్తుంది. ఆ లవ్‌కి ఎలాగైనా పడిపోవాల్సిందే. మనం ఇంటికి వెళ్లగానే.. అది మనల్ని ఎంత మిస్ అయ్యిందో చూపిస్తుంది. దాన్ని చూడగానే కళ్లల్లో ఆ ప్రేమ కనిపిస్తుంది. నేను ఏడుస్తుంటే కూడా నా డాగ్ క్యాస్పర్ తట్టుకోలేడు. నా కన్నీళ్లను కాళ్లతో తుడుస్తుంది. అంత ప్రేమ చూపిస్తుంది. నా ఫ్రెండ్స్ ఎవరైనా సరదాగా కొట్టినా కూడా ఊరుకోదు. వాళ్ల మీదికి వెళ్లిపోతుంది. మా అన్నయ్య, నేను అరుచుకుంటే ఆపండి అని అరుస్తుంది. ఆ ఫీలింగ్స్ అన్నీ మనకి ఒక డాగ్ ఉంటేనే అర్థం అవుతుంది. నేను చెప్తుంటే ఎక్కువలా అనిపిస్తుంది కానీ.. ఒక డాగ్‌ని పెంచుకుని చూడండి.. అప్పుడు తెలుస్తుంది దాని విశ్వాసం. మా నాన్న జనవరి 22న చనిపోయారు.. అదే రోజు మధ్యాహ్నం కోకో (పెట్ డాగ్) పుట్టింది. మా డాడీనే మళ్లీ పుట్టాడని నేను నమ్ముతాను. మా డాడీ ఏం చేస్తాడో కోకో అదే చేస్తాడు. టీవీ చూస్తుంటాడు. నేను బిగ్ బాస్‌కి వెళ్లగానే అలా టీవీలో నన్ను చూస్తూనే ఉంది. నేను ఏడిస్తే వాడూ ఏడుస్తాడు. సేమ్ మా డాడీలాగే బిహేవ్ చేస్తాడు. దాని మొహం చూస్తే మా నాన్నే గుర్తొస్తాడు. మా అమ్మకి కుక్కలంటే ఇష్టం ఉండదు. కానీ.. ఇప్పుడు జాస్ఫర్, కోకోలంటే మా అమ్మకి ప్రాణం. నేను, అన్నలకంటే వాటినే ఎక్కువగా ప్రేమిస్తుంటుంది. వాటికోసం మా అమ్మ ఎక్కడికీ వెళ్లదు. ఇంట్లోనే వాటి కోసం ఉండిపోతుంది. అంత కనెక్షన్ ఉంది వాటితో. వాటికి ఏం పెట్టాలో అన్నీ అమ్మే చూసుకుంటుంది. నేను వాటితో ఆడుకుంటానంతే. నా కష్టం, సుఖం అన్నింటిలోనూ నా కుక్కలు భాగం పంచుకుంటాయి. అందుకే అవంటే నాకు చచ్చేంత ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.