క్యూ4 ఫలితాలపై టీసీఎస్ కీలక ప్రకటన.. డివిడెండ్ కూడా.. ఆల్ టైమ్ కనిష్ఠాల్లో షేరు!

Wait 5 sec.

TCS News: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి దశకు వచ్చింది. మరో 5 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి.. 2026-27 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక కార్పొరేట్ కంపెనీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ త్రైమాసికాల వారిగా ఫలితాల్ని ప్రకటిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల జనవరిలో క్యూ3 ఫలితాల్ని వెల్లడించింది భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఇప్పుడు జనవరి- మార్చి త్రైమాసికం ముగియనున్న తరుణంలో.. క్యూ4 ఫలితాలపైనా ప్రకటన చేసింది. సాధారణంగా ప్రతిసారీ త్రైమాసికం ముగిసిన వెంటనే ఫలితాల్ని మొదటగా టీసీఎస్ ప్రకటిస్తుంటుంది. ఆ తర్వాత ఇతర ఐటీ కంపెనీలు, ఇతర బ్యాంకులు, ఫార్మా కంపెనీలు వంటివి ఫలితాల్ని విడుదల చేస్తుంటాయి. 2026, ఏప్రిల్ 9న (గురువారం) కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై.. మార్చి 31తో ముగిసిన త్రైమాసికం ఫలితాలకు ఆమోదం తెలిపి.. అదే రోజు ఫలితాల్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాాజాగా టీసీఎస్.. స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇదే సమయంలో టీసీఎస్.. మరో ప్రకటన కూడా చేసింది. క్యూ4 ఫలితాలతో పాటుగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించనున్నట్లు పేర్కొంది.. ఆంథ్రోపిక్ సంస్థ కొత్త కొత్త ఏఐ టూల్స్ లాంఛ్ చేసిన నేపథ్యంలో.. ఇది ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచగా.. ఐటీ స్టాక్స్ కొంత కాలంగా దారుణంగా పతనం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే టీసీఎస్ షేర్ కూడా ఇటీవల ఆల్ టైమ్ కనిష్ఠాల్ని తాకింది. మార్చి 25న టీసీఎస్ షేరు 0.87 శాతం తగ్గి రూ. 2,377.90 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 2,348 గా ఉండగా.. ఆల్ టైమ్ హై వాల్యూ రూ. 3,710 గా ఉంది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8.61 లక్షల కోట్లుగా ఉంది. నెలలో 10 శాతం పడిపోగా.. 6 నెలల్లో 18 శాతం తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27 శాతం పతనమైంది. ఏడాదిలో 35 శాతం దిగొచ్చింది. టీసీఎస్ మూడో త్రైమాసికం ఫలితాల విషయానికి వస్తే.. గతేడాది . ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 14 శాతం తగ్గింది. కార్యకలాపాల ఆదాయం 5 శాతం పెరిగి రూ. 67,087 కోట్లుగా ఉంది. అప్పుడు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 57 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.