పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లో బారులు తీరిన వాహనదారులు.. మరోసారి కేంద్రం కీలక ప్రకటన!

Wait 5 sec.

: కొంత కాలంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. . ఇది మరింత ఆందోళన పెంచింది. దీంతో ఇంధన కొరత ఉంటుందన్న భయం, అనుమానాలతో.. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. గురువారం రోజు మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ప్రస్తుతానికి అసలు కొరతే లేదని పేర్కొంది. 60 రోజుల వరకు సరిపడా నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో కూడా పేర్కొంది. >> పెట్రోల్, డీజిల్ సహా ఎల్‌పీజీకి కొరత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేసింది. తప్పుదోవ పట్టించేలా ప్రచారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. ఇలాంటివి అస్సలు నమ్మొద్దని పేర్కొంది. భారతదేశంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్ అని.. ఇంకా ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉందని వెల్లడించింది. ఇప్పుడు దేశీయంగా తగినంత సరఫరా ఉండటమే కాకుండా ఇంకా 150కిపైగా దేశాలకు భారత్.. శుద్ధి చేసిన ఇంధనాల్ని సరఫరా చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. దేశంలోని అన్ని రిఫైనరీలు వంద శాతం ఉత్పాదకత సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు నొక్కిచెప్పింది.చమురు కంపెనీల దగ్గర ప్రస్తుతం రాబోయే 60 రోజుల వరకు సరిపడా క్రూడాయిల్ ఉందని తెలిపిన కేంద్రం.. వ్యూహాత్మక నిల్వలతో కలిపి మొత్తం 74 రోజులకు సరిపడినంత ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలై ఇప్పటికి 27 రోజులు మాత్రమే అయిందని పేర్కొంది. కాబట్టి.. ఇప్పుడు ఎలాంటి భౌగోళిక పరిణామాలతో సంబంధం లేకుండా రానున్న 2 నెలల పాటు స్థిరంగా చమురు సరఫరా చేసేందుకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పెట్రోల్, డీజిల్ సహా ఎల్‌పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తిని కూడా పెంచామని.. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గినట్లు వెల్లడించింది. ఎల్‌పీజీ కొరత లేకుండా చూసేందుకు వేర్వేరు దేశాల నుంచి కార్గోల్ని కూడా తెప్పిస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇంధనం కొరత విషయంలో ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో అయినా తప్పుడు, కల్పిత ఆరోపణలు చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.