వైసీపీని వీడని 11 .. కొత్త పార్లమెంట్ భవనంలో 11వ నంబర్ గది కేటాయింపు, ఎంపీల రిక్వెస్టుతో మార్పు..

Wait 5 sec.

ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవనంలో గదుల కేటాయింపు విషయం.. ఏపీలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. గదుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా స్పీకర్ కార్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11వ నంబర్ గది కేటాయించింది. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీల కోసం నూతన పార్లమెంట్ భవనం ఫస్ట్ ఫ్లోర్‌లోని 11వ నంబర్ గదిని కేటాయించారు. అయితే వైసీపీ ఎంపీలు.. తమ గదిని మార్చాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిసింది. స్పీకర్‌ ఓంబిర్లాతో భేటీ అయిన వైసీపీ ఎంపీలు.. తమకు 11వ నెంబర్ గద వద్దని కోరినట్లు తెలిసింది. అందుకు బదులుగా మరో గదిని కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీ ఎంపీల విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న స్పీకర్.. వైసీపీ ఎంపీల కోసం 12వ నంబర్ రూమ్ కేటాయిస్తూ మార్పులు చేశారు.మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో టీడీపీకి 9వ నంబర్ గది కేటాయించారు. మొదటి అంతస్తులోని 9వ నంబర్ గదిని టీడీపీ ఎంపీల కోసం కేటాయించారు. కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రావటంతో.. పాత పార్లమెంట్‌ భవనంలో ఉన్న పార్టీ ఆఫీసులనుఖాళీ చేయిస్తున్నారు. నూతన పార్లమెంట్ భవనంలో పార్టీలకు గదులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి 12, టీడీపీకి 9వ నంబర్ గదులు కేటాయించారు. మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోపరిమితమైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ.. 2024లో మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రివర్గంలోని నేతలందరూ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ సామర్థ్యంలో పది శాతం సీట్లు సాధించకపోవటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే నూతన పార్లమెంట్ భవనంలో వైసీపీకి 11 నంబర్ గది కేటాయించడం.. ఆ తర్వాత వైసీపీ ఎంపీల అభ్యర్థనతో దానిని 12వ నంబర్ గదికి మార్చటం చర్చనీయాంశమవుతోంది.