గత రెండు నెలలుగా తరుచూ వార్తల్లో నిలుస్తోన్న సంచలన ప్రకటన చేశారు. రెండు లక్షల మందితో ఓ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సంప్రదాయ, ఆధునిక ఆయుధాలతో సన్నద్ధమయ్యే ఈ సైన్యంలో కుల, వర్గ, లింగ బేధాలు ఉండవని తెలిపారు. గోవుల సంతతి, హిందూ ధర్మాన్ని ఈ సైన్యం రక్షిస్తుందని అవిముక్తేశ్వరానంద వెల్లడించారు. ‘ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని రక్షించే ఈ సైన్యంలో అన్ని హిందూ కులాలకు చెందిన 2,18,000 మందిని చేర్చుకుంటాం’ అని పీఠాధిపతి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభించబోయే ఈ సైన్యానికి '' అని పేరు నిర్ణయించినట్టు అన్నారు. 2.18 లక్షల మందితో కూడిన ఈ సైన్యానని మహాభారత కాలం మాదిరిగా కాల్బలం, అశ్వబలం, గజబలం, రథబలం అనే నాలుగు విభాగాలుగా విభజించనున్నట్టు చెప్పారు. అన్ని హిందూ వర్గాలకు చెందిన పురుషులు, మహిళలు, థర్డ్ జెండర్‌ ఇందులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ సైన్యం మతం, సంస్కృతి, సమాజాన్ని రక్షిస్తుందని వివరించారు.అయితే, ప్రస్తుతం వారణాసిలో ఉన్న చేసి ప్రత్యేక సైన్యం ప్రకటన వివాదాస్పదమవుతోంది. పీఠాధిపతి, ఆయన అనుచరగణం గొడ్డలి నమూనాలను ప్రదర్శించడంపై యూపీ ప్రభుత్వం యంత్రాంగం నిశితంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. లైసెన్సు లేని ఆయుధాలను కలిగి ఉండటం, వాటిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో ప్రయాగ్‌రాజ్‌ మాఘ మేళా సందర్భంగా.. పల్లకీలో తన శిష్యులతో కలిసి ఊరేగింపుగా ‘పవిత్ర సంగమం’ వైపు వెళ్లేందుకు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద ప్రయత్నించారు. దీనిని అధికారులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఆయన విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. దీనిపై యోగి స్పందిస్తూ.. రామాయణంలో ఆంజనేయుడ్ని మోసం చేయడానికి ‘కాలనేమి’ రాక్షసుడు సాధువు వేషం వేసుకున్నాడని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. అలాగే, గత నెల ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదు రావడంతో యూపీ పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదుచేశారు. ఆశ్రమంలోని బాలికలపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.