రైతు రుణాల మాఫీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

Wait 5 sec.

Farmer Schemes: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని వివిధ వర్గాల వారికి ఎన్నో రకాల స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆడపిల్లలు, ఉద్యోగులు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు ఇలా అందరి కోసం పథకాల్ని లాంఛ్ చేస్తూనే ఉంది. రైతుల కోసం ప్రస్తుతం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అందుబాటులో ఉంది. ఇంకా వీరి కోసం ఫసల్ బీమా యోజన, మాన్ ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి స్కీమ్స్ అందిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గురించి వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లోక్‌సభ వేదికగా క్లారిటీ ఇచ్చారు. రైతు రుణాల మాఫీకి సంబంధించి తమ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. లోక్‌సభలో ఒక సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. పరిశీలన లేకపోయినప్పటికీ.. రైతులకు అండగా ఉండేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని వివరించారు. అన్నదాతల ఆర్థిక స్థితిగతుల బలోపేతం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించారు నిర్మలా సీతారామన్. ముందుగా కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా అర్హులైన రైతులకు వడ్డీ రేట్లలో రాయితీతో రూ. 3 లక్షల వరకు లోన్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ లోన్లు సకాలంలోనే తిరిగి చెల్లించినట్లయితే.. సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISS) కింద ఇంకా అదనపు ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అనుబంధ కార్యకలాపాల లోన్లతో సహా ఎలాంటి పూచీకత్తు లేని స్వల్పకాలిక వ్యవసాయ రుణాల్ని రూ. 1.60 లక్షల నుంచి 2 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. వ్యవసాయంతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలకు భారత బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తగినంత రుణ ప్రవాహం ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇంకా ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ. 6 వేల చొప్పున నగదు బదిలీ చేయడంతో పాటు పంటల బీమా కూడా అందిస్తున్నట్లు తెలిపారు.