విశాఖపట్నం వాసుల ఎదురుచూపులు ఫలించాయి. దేశంలోనే పెద్ద మాల్స్‌లలో ఒకటైన ఇనార్బిట్ మాల్ వైజాగ్‌వాసులకు అందుబాటులోకి వచ్చింది.. మార్చి 23వ తేదీన అధికారికంగా ఇనార్బిట్ మాల్ ప్రారంభించారు. శుక్రవారం నుంచి ( మార్చి 27) ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో విశాఖ వాసులు ఇనార్బిల్ మాల్ ముందు క్యూ కట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షాపింగ్ చేయటానికి వచ్చినవారితో పాటుగా.. సెల్ఫీలు, వీడియోలు తీసుకోవటం కోసం వచ్చినవారంతా ఇనార్బిట్ మాల్ ముందు ఉన్న రోడ్డుపై క్యూ కట్టారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిర్మించారు. 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇనార్బిట్ మాల్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇనార్బిట్ మాల్‌ను పర్యావరణహితంగా ప్రాజెక్టుగా నిర్మించారు. మొదటి విడత కింద రూ.500 కోట్లతో ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తి చేశారు. రెండో దశలో రూ.300 కోట్లతో ఇనార్బిట్ మాల్‌ను విస్తరించనున్నారు. ఏడాదిలోపు ఈ పనులు పూర్తి చేస్తామని ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈవో రజనీష్‌ మహజన్‌ తెలిపారు. విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలు16.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణంపూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌తో మాల్ నిర్మాణంఇనార్బిట్ మాల్‌లో మొత్తం 8 స్క్రీన్ థియేటర్లుఒక్కో స్క్రీన్ థియేటర్ సామర్థ్యం 1,600 సీట్లు ఏడు లెవల్స్‌లో పార్కింగ్‌ ప్రదేశాలుఐదు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లుఇంతే కాకుండా విశాఖ ఇనార్బిట్ మాల్‌ చుట్టూ 1.1 కి.మీ మేరకు జాగింగ్‌ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇనార్బిట్ మాల్ టెర్రస్ మీద నుంచి విశాఖ అందాలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే పెంపుడు జంతువుల పార్కు ఏర్పాటు చేశారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా.. విశాఖ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన నిర్వహించారు. కేవలం 31 నెలలోనే పూర్తి చేసి.. ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తి చేసి విశాఖవాసులకు అందుబాటులోకి తెచ్చారు.