దేశంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. పసి పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వరకు దారుణంగా దాడులు చేసి హతమార్చుతున్నాయి. వీధి కుక్కల దాడుల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లినా.. ఈ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. తాజాగా భువనగిరి జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి కరంగా మారింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసిన ఓ వీధి కుక్క వారిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఓ చిన్నారి కన్ను గుడ్డుని వీధి కుక్క బయటికి లాగేయడం హృదయాలను ద్రవిస్తోంది.భువనగిరి పట్టణంలోని తారకరామా నగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 4 ఏళ్ల చిన్నారి సందెల ప్రియాంష్.. తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఆ చిన్నారులపై ఓ వీధి కుక్క భీకరంగా దాడి చేసింది. వీధి కుక్క దాడిలో బాబు కనుగుడ్డు బయటికి రావడంతోపాటు.. అతడి ముఖంపై తీవ్ర గాయాలు అయ్యాయి. కనుగుడ్డు బయటికి రావడంతో నొప్పిని భరించలేని ప్రియాంష్.. అల్లాడిపోయాడు. అది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. వెంటనే ఆ చిన్నారిని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. బాలుడి పరిస్థితి తీవ్ర విషమంగా మారడంతో మరింత మెరుగైన వైద్యం కోసం భువనగిరి ప్రభుత్వాస్పత్రి డాక్టర్లు అతడిని హైదరాబాద్‌కు తరలించాలని సూచించడంతో హుటాహుటిన తల్లిదండ్రులు యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రియాంష్ తండ్రి రాహుల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే ఘటనలో బాలుడితో ఆడుకుంటున్న మరో చిన్నారికి కూడా గాయాలు అయ్యాయి. అతడిని భువనగిరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో భువనగిరి పట్టణంలో అంటేనే తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు.. అదే భువనగిరి పట్టణంలోని ఆర్‌బీ నగర్‌లో మరో ఇద్దరు చిన్నారులపైనా వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. కమల్‌ అనే వ్యక్తి కుమారుడు అగర్వాల్‌తోపాటు.. శంకర్‌ అనే వ్యక్తి కొడుకు తన్వీష్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయాల పాలు చేశాయి. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంలో వరుస వీధి కుక్కల దాడుల ఘటనలు పెరిగిపోవడంతో బాధిత కుటుంబాలు మాత్రమే కాకుండా.. స్థానికులు భువనగిరి హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.