యుద్ధం వేళ సీఎంలతో ప్రధాని భేటీ.. రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై కీలక చర్చలు

Wait 5 sec.

పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకున్న ఉద్రిక్తతలు, దేశంపై దాని ప్రభావం, పరిణామాలపై చర్చించేందుకు సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని వారితో మాట్లాడారు. ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సహా మిగతా రాష్ట్రాల సీఎంలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల సన్నద్దత, ప్రణాళికలపై ప్రధాని చర్చలు జరిపారు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలను సమన్వయం చేసుకునేలా జరిగిన ఈ భేటీకి హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. , చమురు, గ్యాస్ సంక్షోభం నివారణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల దృష్ట్యా, ఇంధన సరఫరా, ద్రవ్యోల్బణం, లాజిస్టిక్స్‌ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ పరిస్థితి వల్ల తలెత్తే ఏవైనా పరిణామాలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.