మహిళల షాపింగ్ కోసం కూపన్లు, ఉచితంగా ల్యాప్‌టాప్‌లు.. డీఎంకే హామీల వర్షం..

Wait 5 sec.

తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఒక్కొక్కప్రకటిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించటమే లక్ష్యంగా వరాల జల్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార డీఎంకే పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆదివారం విడుదల చేశారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సాధికారత, విద్యారంగం, వ్యవసాయరంగం, ఆరోగ్యం, పరిశ్రమ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలలో తమ మేనిఫెస్టో సూపర్ స్టార్ అవుతుందని స్టాలిన్ అభివర్ణించారు. 234 సీట్లకు గానూ 200 పైచిలుకు స్థానాలలో గెలుపొంది తమిళనాడులో ఏడోసారి అధికారంలోకి వస్తామని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎంకే ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమైన అంశం.. మహిళలకు కూపన్లు. ఇళథరసి పథకం పేరిట మహిళలకు కూపన్లు అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఈ పథకం కింద ఆదాయ పన్ను పరిధిలోకి రాని గృహిణులకు.. రూ.8000 విలువైన కూపన్ అందిస్తారు. ఈ కూపన్ ఉపయోగించి మహిళలు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, మిక్సీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయవచ్చు. అలాగే మార్చుకోవచ్చని స్టాలిన్ వెల్లడించారు. అలాగే మహిళలకు అందిస్తు్న్న ఆర్థిక సాయాన్ని వేయి నుంచి రెండు వేలకు పెంచుతామని స్టాలిన్ వెల్లడించారు. వృద్ధాప్య పింఛను రూ.2వేలకు పెంచటంతో పాటుగా.. పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకూ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుచేస్తామని ప్రకటించారు. యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని.. రైతులకు ఉచితంగా మీటర్లు లేని వ్యవసాయ మోటర్లు పంపిణీ చేస్తామని డీఎంకే ప్రకటించింది. పది లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం, పది లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా.. విద్యార్థినులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.1500లకు పెంపు వంటి హామీలను డీఎంకే తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. మరోవైపు ఏప్రిల్ 23వ తేదీ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి ఒక కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ, అన్నాడీఎంకే మరో కూటమిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. సినీ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ 234 స్థానాలలోనూ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఆదివారం ప్రకటించింది. చేస్తున్నారు.