ఫొటో షూట్‌లో అదిరిపోయిన కొత్త బాస్‌లు!

Wait 5 sec.

సీజన్ ప్రారంభానికి ముందు లీగ్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ఒక్క చోట చేరారు. ఏటా సీజన్ ప్రారంభానికి ముందు.. ఐపీఎల్ నిర్వహకులు కెప్టెన్లతో ఫొటో షూట్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం అంటే మార్చి 25న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్‌కు సంబంధించిన కెప్టెన్‌ల సమావేశం ఏర్పాటు చేశారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇది జరిగింది. ఇందులో అన్ని ఫ్రాంఛైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్ పంచుకున్న ఫొటోల్లో కెప్టెన్లంతా సరదాగా నవ్వుతూ కనిపించారు. వారంతా క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.ఐపీఎల్ 2026లో పది ఫ్రాంఛైజీల కెప్టెన్లు ఎవరంటే..రజత్ పాటీదార్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుహార్దిక్ పాండ్యా - ముంబై ఇండియన్స్రుతురాజ్ గైక్వాడ్ - చెన్నై సూపర్ కింగ్స్శ్రేయస్ అయ్యర్ - పంజాబ్ కింగ్స్అజింక్య రహానే - కోల్‌కతా నైట్ రైడర్స్అక్షర్ పటేల్ - ఢిల్లీ క్యాపిటల్స్ఇషాన్ కిషన్ - సన్ రైజర్స్ హైదరాబాద్ రియాన్ పరాగ్ - రాజస్థాన్ రాయల్స్శుభ్‌మన్ గిల్ - గుజరాత్ టైటాన్స్రిషభ్ పంత్ - లక్నో సూపర్ జెయింట్స్కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు ప్యాట్ కమిన్స్.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. అతడి సారథ్యంలో సన్ రైజర్స్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచులు ఆడే అవకాశం ఉంది. కమిన్స్.. తిరిగి జట్టులోకి వస్తే అతడే సారథ్య బాధ్యతలు చేపడతాడు.