పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో వెలువరించారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను అన్నింటినీ కొట్టిపారేశారు. అయితే ఈ వ్యవహారం అంతటితో ఆగడం లేదు. మళ్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే పిటిషనర్లు చేసిన వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు.. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఇదే వ్యవహారంలో దానం నాగేందర్‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పూర్తి అయిపోయింది అనుకున్న తెలంగాణ పార్టీ ఫిరాయింపుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరోవైపు.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఇటీవలె హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్.. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిపారు. అయినప్పటికీ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారని.. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని తన పిటిషన్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.