టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత..

Wait 5 sec.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ ఆసుపత్రిలో కోటంరెడ్డి శ్రీధర్ చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేలూరు సీఎంసీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొంతకాలంగా న్యూరో సంబంధిత సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేరళ ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో నయం కాకపోవటంతో సీఎంసీ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని.. మరో ఐదారు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరోవైపు వందల కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. , ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పనులను సకాలంలో పూర్తి చేసేందుకు స్కూటీపై తిరుగుతూ అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులనుతెలిసిందే. కోటంరెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాసి అభినందించటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోటంరెడ్డికి చంద్రబాబు సూచించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అనంతరం రాజకీయ పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓసారి అస్వస్థతకు గురయ్యారు. 2022 మేలో జగనన్న మాట- కోటంరెడ్డి బాట కార్యక్రమంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు కోటం రెడ్డి. ఈ సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. అయితే సహచరులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. అనంతరం చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కోటంరెడ్డి కోలుకున్నారు.