: గత కొంత కాలంగా భారతదేశంలో టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు సహా రిఫ్రిజరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఎంట్రీ లెవెల్ ప్రైసెస్ గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు. 7-8 ఏళ్ల కిందటే ధరలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత ప్రభుత్వ విధానాలు, స్థానిక ఉత్పత్తి పెరగడం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం సహా ఇంకా జీఎస్టీ రేట్ల తగ్గింపు.. కంపెనీలు మంచి ఆఫర్లు అందించడం వల్ల ధరలు అందుబాటులో ఉండేవి. ఇంకా ఎలక్ట్రానిక్స్‌పై కేంద్రం వరుసగా దిగుమతి సుంకాల్ని కూడా తగ్గిస్తూ వచ్చింది. అయితే . ఇప్పుడు ఇన్‌పుట్ కాస్ట్స్ (ముడి సరకు ధరలు) పెరగడం సహా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చిప్ కొరత వంటివి ధరలు పెరిగేందుకు కారణంగా ఉందని అంటున్నాయి. >> ఇప్పుడు ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్ ధరలు 6-8 ఏళ్ల కిందట ఉన్న గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి. ట్రెండ్ వెనక్కి వెళ్తుందన్నమాట. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక ధరల పెరుగుదలను తాము నియంత్రించలేమని తయారీదారులు చెబుతున్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఎయిర్ కండిషనర్లు (AC), రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు కూడా వచ్చే నెల నుంచి రికార్డు స్థాయిలో పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని.. గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది అంటున్నారు. వేసవి సీజన్‌లో సేల్స్ పెంచకపోతే గనుక.. ఎంట్రీ సెగ్మెంట్ డిమాండ్ మరింత బలహీనపడొచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ ధరలు దీపావళి సమయంలో రూ. 10 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు రూ. 13- 14 వేల స్థాయికి చేరాయి. వచ్చే త్రైమాసికం నాటికి ఇది రూ. 17- 18 వేల వరకు చేరొచ్చని భావిస్తున్నారు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ధరల్ని చేరొచ్చని చెబుతున్నారు. కొన్ని బ్రాండ్స్.. రాబోయే 2-3 నెలల్లో ఈ ధరల్ని రూ. 20 వేల మార్కుకు చేర్చొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. గతేడాది రూ. 6500 గా ఉన్న.. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర ఇప్పుడు రూ. 8500 కు చేరింది. మే నెల కల్లా ఇది రూ. 10 వేలకు చేరొచ్చని భావిస్తున్నారు. గతేడాది . ఇవి 2017-18 స్థాయి ధరలు కావడం గమనార్హం. తొలిసారి కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయంగా ఉండే.. 3 స్టార్ 1.5 టన్నుల ఏసీ ధరలు గత వేసవిలో రూ. 32 వేల నుంచి రూ. 34 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు రూ. ఏప్రిల్ నెలలో రూ. 37 వేల నుంచి రూ. 40 వేల వరకు చేరొచ్చని తయారీదారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి, యుద్ధం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఇప్పటికే వివో, ఒప్పో, సామ్‌సంగ్, షియోమీ వంటి కంపెనీలు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటికే 10 శాతం వరకు ధరల్ని పెంచాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ఫౌండర్, ఛైర్మన్ కైలాశ్ లఖ్యాని చెప్పారు. గత నవంబర్- డిసెంబర్ నుంచి ప్రతి 30-60 రోజులకు స్మార్ట్ ఫోన్, టీవీ ధరలు పెరుగుతూనే ఉన్నాయంట.