అదరగొట్టిన 'హైదరాబాద్'.. రూ.1 లక్ష కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు.. దేశంలోనే రెండో స్థానం

Wait 5 sec.

Real Estate: హైదరాబాద్ మహానగరానికి నిత్యం వేలాది మంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు మొగ్గు చూపిస్తుంటారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో అదరగొట్టింది. బలమైన వృద్ధిని నమోదు చేసింది. క్రెడాయ్- లియోసెస్ ఫోరాస్ రిపోర్ట్ తెలిపింది. 2025 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఏకంగా రూ.1 లక్ష కోట్లకుపైగా విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయని, దేశంలోనే లగ్జరీ మార్కెట్ సెక్టార్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. దేశంలోనే అగ్రగామి రియల్ ఎస్టేట్ గృహ మార్కెట్లో భాగ్యనగరం ఒకటిగా నిలిచినట్లు నివేదిక పేర్కొంది. 2025లో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ రూ.1.08 లక్షల కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. సిటీలో ఇళ్ల ధరలు వార్షికంగా 5.7 శాతం పెరుగుతున్నాయని, ప్రధాన ఐటీ, వ్యాపార కేంద్రం కావడం వల్ల హైదరాబాద్‌ నగరం సొంతిల్లు కొనేవారిని, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నివేదిక వెల్లడించింది. ఐటీ, బిజినెస్ హబ్‌ల విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన ఆర్థిక పునాదులే హైదరాబాద్ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. దీంతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచినట్లు పేర్కొంది. అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల విభాగాలు ఉన్నాయి. ఇది నగర గృహ మార్కెట్లో ప్రీమియం ఇళ్ల వైపు మారుతున్న ధోరణిని సూచిస్తోంది. విశాలమైన ఇళ్లపై ఆసక్తి పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమవుతోన్న ప్రాజెక్టుల్లో 3బీహెచ్ఏ యూనిట్లు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల ధరల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 4 బీహెచ్‌కే యూనిట్లు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. విశాలమైన ఇళ్ల కోసం డిమాండ్ పెరుగుదలకు ఇదే నిదర్శనంగా నివేదిక తెలిపింది. హైదరాబాద్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని, ప్రస్తుతం 797 బిల్డర్లు చేపట్టిన 1217 ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు 21 నెలలు ఇన్వెంటరీ ఉంది. ఇది డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యతను సూచిస్తుంది. 2025లో ధరలు సైతం స్థిరంగా పెరిగాయి. హౌస్ ప్రైస్ ఇండెక్స్ 3.3 శాతానికి పెరిగింది. గతంలో ఉన్న స్తబ్దత నుంచి మార్కెట్ కోలుకుని, ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడిదారుల నమ్మకానికి ఈ వృద్ధి ప్రతిబింబిస్తోంది.