: పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో.. మళ్లీ పతనం అవుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ.. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. డాలర్ పుంజుకోవడం కారణంగా.. బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు వచ్చిందని.. చర్చలు జరుగుతున్నాయని.. అదే విధంగా 5 రోజుల పాటు విద్యుత్ కేంద్రాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో.. 2 రోజుల కిందట క్రూడాయిల్ ధరలు భారీగా దిగిరాగా.. . మళ్లీ రెండు రోజుల తర్వాత ఇవాళ మార్చి 26న సాయంత్రం ధరలు మళ్లీ పతనం అయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు 4560 డాలర్ల మార్కుపైన ట్రేడవగా.. ఇప్పుడు మళ్లీ భారీగానే తగ్గి 4450 డాలర్ల దిగువకు చేరింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు కూడా భారీగానే తగ్గి 74 డాలర్ల స్థాయి నుంచి.. 69 డాలర్లకు దిగొచ్చింది. ఇక డాలరుతో పోలిస్తే రూాపాయి మారకం విలువ మాత్రం రూ. 94.20 వద్ద కొనసాగుతోంది. >> ఇక దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దిగొచ్చాయి. క్రూడాయిల్ ధరలు మళ్లీ మార్చి 26న 5 శాతం వరకు పెరిగి 108 డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే బంగారం ధరలు దిగొచ్చాయి. ప్రముఖ జువెల్లరీల్లో చూస్తే లలితా జువెల్లరీలో గ్రాము పసిడి ధర ఉదయం రూ. 13,465 వద్ద ఉండగా.. సాయంత్రం తర్వాత ధర తగ్గింది. ప్రస్తుతం గ్రాము గోల్డ్ రేటు రూ. 215 మేర తగ్గి రూ. 13,250 వద్ద ఉంది. ఇక తులం ధర రూ. 1,32,500 వద్ద ఉందని చెప్పొచ్చు.ఇతర జువెల్లరీల్లో చూస్తే తనిష్క్ జువెల్లరీలో గోల్డ్ రేటు గ్రాముకు రూ. 13290 వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు ఇది రూ. 13,485 వద్ద ఉంది. ఖజానా జువెల్లరీలోనూ ధర గ్రాముకు రూ. 215 మేర.. తులంపై రూ. 2150 మేర తగ్గి ప్రస్తుతం గ్రాము పసిడి ధర రూ. 13,250 వద్ద ఉంది. ఇతర జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కళ్యాణ్ జువెల్లర్స్‌లోనూ గ్రాము గోల్డ్ రేటు రూ. 13,250 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధర భారీగానే దిగొచ్చింది. ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ. 2100 కుపైగా పతనంతో 24 క్యారెట్ల ధర రూ. 1.42 లక్షల స్థాయిలో కొనసాగుతోంది.